ENGLISH

మహేష్‌ ఇంకో 25 సినిమాలు మాత్రమేనా?

02 May 2019-12:30 PM

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన 25వ సినిమా విడుదల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడు. చాలా ఎక్కువ కాలం షూటింగ్‌ జరగడం, భారీ బడ్జెట్‌తో రూపొందడం అన్నిటికీ మించి నెంబర్‌ పరంగా ల్యాండ్‌ మార్క్‌ కావడం ఇలా చాలా అంశాల నేపథ్యంలో మహేష్‌ 'మహర్షి' సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. కెరీర్‌లో ఇప్పటిదాకా 24 సినిమాలు చేసిన మహేష్‌, 25వ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు సరేగానీ, ఇంకా ఎన్ని సినిమాల్ని ఆయన చేయగలడు? ఈ ప్రశ్నకి మహేష్‌ స్ట్రెయిట్‌గానే సమాధానం చెప్పేశాడు.

 

'ఇంకో పాతిక సినిమాలు' అని మహేష్‌ చెప్పేసరికి అభిమానులు కొంత డిజప్పాయింట్‌ అయ్యారు. 'మహర్షి' ప్రీ-రిలీజ్‌ వేడుకలో ఓ సినీ ప్రముఖుడు, మహేష్‌ తన తండ్రి కృష్ణ లాగానే మూడు వందల సినిమాల మార్క్‌ దాటాలని ఆకాంక్షిస్తే, మహేష్‌ మాత్రం ఇంకో ఇరవయ్యేళ్ళు ఓ పాతిక సినిమాలు అంటూ తన ప్రసంగంలో పేర్కొనడం గమనార్హం. మహేష్‌ ఎప్పుడూ ఆకాశానికి నిచ్చెన వేయడు అసాధ్యమనుకున్న విషయాల గురించి గొప్పలు చెప్పడు. అదే అతని ప్రత్యేకత. రీల్‌ లైఫ్‌లోనే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ మహేష్‌ సూపర్‌ స్టార్‌ అని కొందరు అంటుంటారు. అది నిజం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ స్టార్‌ హీరో ఏడాదికి ఓ సినిమా చేయడం చాలా కష్టం. సో, అందుకే మహేష్‌ సింపుల్‌గా ఇంకో ఇరవై సినిమాలు మాత్రమేనని అనేశాడు.

ALSO READ: 'మహర్షి'ని తొక్కేస్తున్నదెవరు?