ENGLISH

‌మ‌హేష్ మ‌ళ్లీ మొద‌లెట్టాడు

14 April 2021-09:35 AM

క‌రోనా టాలీవుడ్ ని కంగారు పెడుతోంది. సినిమాలు వాయిదా ప‌డుతున్నాయి. దాంతో పాటు షూటింగులూ స‌జావుగా జ‌ర‌గ‌డం లేదు. అయినా స‌రే.. మ‌హేష్ బాబు ధైర్యంగా రంగంలోకి దిగాడు. త‌న సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభించాడు. మ‌హేష్ - ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో `స‌ర్కారు వారి పాట‌` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ క‌థానాయిక‌. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఉగాది సంద‌ర్భంగా ప్రారంభ‌మైంది. నెలాఖ‌రు వ‌ర‌కూ హైద‌రాబాద్ లోనే షూటింగ్ జ‌ర‌గబోతోంది. ఈ షెడ్యూల్ లో ప్ర‌ధాన న‌టీన‌టులు అంతా పాలు పంచుకుంటారు.

 

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయ‌డానికి మ‌హేష్ తొంద‌ర‌గా ఉన్నాడు. ఎందుకంటే.. త్రివిక్ర‌మ్ తో సినిమా ఓకే అయిపోయింది. స‌ర్కారు వారి పాట పూర్త‌యితే గానీ, త్రివిక్ర‌మ్ సినిమా మొద‌లెట్టేందుకు లేదు. అందుకే వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమాకి పుల్ స్టాప్ పెట్టాల‌ని చూస్తున్నాడు. అందుకే... ఇంత ఫాస్ట్ గా షెడ్యూల్ మొద‌లెట్టేశారు.

ALSO READ: బాల‌య్య సింహ‌గ‌ర్జ‌న‌.. 'అఖండ'