ENGLISH

గ్లామ్‌షాట్‌: హాట్‌ హాట్‌ మసాలా 'నేల టికెట్‌'

25 May 2018-11:56 AM

'నేల టిక్కెట్టు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న ముద్దుగుమ్మ మాళవికా శర్మ. తొలి చూపులోనే అందరి మనసుల్ని కొల్లగొట్టేసిందీ భామ. చూడగా చూడగా ఇంకా ముద్దొచ్చేస్తోంది. హీరోయిన్‌గా గ్లామర్‌లోనూ పంచరంగులు చూపించేస్తోందీ పంచదార చిలక.

'నేల టిక్కెట్టు'తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో తన గ్లామర్‌ని ఒలకబోసేస్తూ, హొయలు పోతోందిలా. ట్రెండీ జీన్స్‌ బాటమ్‌తో చెక్స్‌ హాఫ్‌ హ్యాండ్స్‌ షర్టు మడతెట్టి మాస్‌ ఆడియన్స్‌కి సవాల్‌ విసురుతోంది. తొలి సినిమాకే రవితేజ వంటి స్టార్‌ హీరోతో నటించే ఛాన్స్‌ దక్కించుకుంది.

అంతేనా, ఒక్కసారి కాదు, మళ్లీ మళ్లీ రవితేజతో నటించాలనుందట ఈ ముద్దుగుమ్మకి. రవితేజని కూడా అంతగానే ఇంప్రెస్‌ చేసేసింది. చూడాలి మరి ఆడియన్స్‌ని ఎలా ఇంప్రెస్‌ చేస్తుందో.

ALSO READ: Qlik Here Hot Photoshoot