ENGLISH

'మా' ఎన్నిక‌లు: విజ‌యం విష్ణుదే!

10 October 2021-18:48 PM

అత్యంత ర‌స‌వ‌త్త‌రంగా సాగిన `మా` ఎన్నిక‌ల‌లో చివ‌రికి విజ‌యం మంచు విష్ణునే వ‌రించింది. ప్ర‌కాష్ రాజ్ పై భారీ ఆధిక్యంతో గెలుపొంది.. `మా` అధ్య‌క్ష స్థానాన్ని మంచు విష్ణు కైవ‌సం చేసుకున్నారు. ఈ ప‌ద‌విలో ఆయ‌న రెండేళ్లు ఉంటారు. అధ్య‌క్షుడిగా విష్ణు ప్ర‌మాణ స్వీకారం ఎప్పుడు చేస్తారో తెలియాల్సివుంది. అయితే... ఎగ్జిక్యూటీవ్ మెంబ‌ర్ల జాబితా చూస్తే... విష్ణు కంటే ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ వాళ్లే ఎక్కువ గెలిచారు.

 

ఈసీ స‌భ్యులుగా ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ నుంచి 11 మంది స‌భ్యులు గెలిస్తే.. విష్ణు ప్యాన‌ల్ నుంచి ఏడుగురు మాత్ర‌మే విజ‌యం సాధించారు. జాయింట్‌ సెక్రటరీగా ఉత్తేజ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా బెనర్జీ, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్ గెలుపొందారు. మంచు విష్ణు ప్యాన‌ల్ నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌గా మాదల రవి, జనరల్‌ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్‌గా శివబాలాజీ విజయం, జాయింట్‌ సెక్రటరీగా గౌతమ్‌రాజు విజయం సాధించారు.

ALSO READ: అఫీషియల్: నిర్మాత ప్రేమలో రకుల్