ENGLISH

ఛాన్సొస్తే మళ్లీ వస్తానంటోన్న చైతూ బ్యూటీ.!

04 December 2018-10:43 AM

'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పిన బ్యూటీ మంజిమా మోహన్‌. అక్కినేని బుల్లోడు నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాల ఖాతాలోకి వెళ్లినట్లే. కానీ కథ పరంగా విలక్షణ చిత్రంగా అందర్నీ ఆకట్టుకుంది. హీరోయిన్‌గా నటించిన మంజిమా మోహన్‌ తొలిచూపులోనే కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేసింది. క్యూట్‌గా కనిపిస్తూనే మెచ్యూర్డ్‌ పర్‌ఫామెన్స్‌తో ఆకర్షించింది. అయితే ఆ సినిమా తర్వాత మరెక్కడా కనిపించలేదీ బ్యూటీ. యాక్టింగ్‌ టాలెంట్‌లో మంచి ప్రావీణ్యం చూపించినా ఎందుకో మంజిమా మోహన్‌కి మరో అవకాశం రాలేదు.

 

ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ 'క్వీన్‌' మలయాళ రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు తమిళ హీరో జీవాతో ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 'రంగం', స్నేహితుడు' తదితర సినిమాలతో జీవా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమవుతూ ఉంటాయి. ఇప్పుడు జీవా, మంజిమా మోహన్‌ జంటగా తెరకెక్కుతోన్న ఈ తాజా చిత్రాన్ని కూడా తెలుగులో విడుదల చేయనున్నారనీ తెలుస్తోంది.

 

అరుళ్‌ నిధి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫ్రెండ్‌షిప్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని జీవా సోదరుడు జితిన్‌ రమేష్‌ నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ నెల 13న ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, తెలుగు సినిమాల్లో మంచి అవకాశాలొస్తే మళ్లీ నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతోందీ క్యూట్‌ బ్యూటీ. కథ నచ్చితే ఇంపార్టెంట్‌ రోల్స్‌లో కనిపించడానికైనా ఓకే అని ముద్దు ముద్దుగా చెప్పేస్తోంది అందాల మంజిమా మోహన్‌.

ALSO READ: బోల్డ్‌నెస్‌తో పాటు, ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..!