ENGLISH

ప‌గ‌టి క‌ల‌లు కంటున్న మంజుల‌ మంజుల‌..

09 November 2020-11:00 AM

`షో` సినిమాతో తొలిసారి తెర‌పైకొచ్చింది. కృష్ణ కూతురిగా కాకుండా త‌న‌కంటూ ఓ ముద్ర వేయాల‌ని ప్ర‌య‌త్నించింది. మ‌హేష్ సినిమాల‌కు ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా చూసుకుంది. ఆరెంజ్ లాంటి సినిమాల్లో న‌టించింది. ఆమ‌ధ్య `మ‌న‌సుకు న‌చ్చింది`తో డైరెక్ట‌ర్ అయిపోయింది. అయితే ఆ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో.. మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ తెర‌పైకి రావాల‌ని, డైరక్ష‌న్ చేయాల‌ని క‌ల‌లు కంటోంది. మంజుల డైర‌క్ష‌న్ అంటే.. యంగ్ హీరోలు సై అంటారు. ఎందుకంటే త‌న బ్యాక్ గ్రౌండ్ అలాంటిది.

 

అయితే మంజుల దృష్టి నేరుగా సోద‌రుడు మ‌హేష్ బాబు పై ప‌డింది. ఎప్ప‌టికైనా మ‌హేష్ తో ఓ సినిమా చేయాల‌ని, ఆ క‌ల త్వ‌ర‌లో నెర‌వేరుతుంద‌ని చెబుతోంది మంజుల‌. స్టార్ ద‌ర్శ‌కుల‌కే... మ‌హేష్ ఛాన్సులు అంత త్వ‌ర‌గా ఇవ్వ‌డు. ఎవ‌రు హిట్ ఇస్తే.. వాళ్ల‌తో సినిమాలు చేసుకుంటూ పోతాడు. అలాంటి మ‌హేష్‌... మంజుల‌తో సినిమా చేస్తాడ‌నుకోవ‌డం అత్యాసే. `మ‌న‌సుకు న‌చ్చింది` ప్ర‌మోష‌న్ స‌మ‌యంలోనూ.. ప‌వ‌న్ తో సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే అది ప్ర‌మోష‌న్ స్టంట్ గానే మిగిలిపోయింది. ఇప్పుడూ అంతేనేమో.?

ALSO READ: 'గ‌తం' మూవీ రివ్యూ & రేటింగ్!