ENGLISH

మారుతి మ‌రో మెగా ఆఫ‌ర్‌

14 November 2021-10:12 AM

మెగా కాంపౌండ్ అంటే మారుతికి, మారుతి అంటే మెగా కాంపౌండ్ కి వ‌ల్ల‌మాలిన అభిమానం. గీతా ఆర్ట్స్ తో మారుతిని అనుబంధం ఉంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, కొత్త జంట సినిమాల్ని గీతా ఆర్ట్స్ లోనే తీశాడు మారుతి. సాయిధ‌ర‌మ్ తేజ్ తో ఓ సినిమా చేశాడు. త్వ‌ర‌లోనే చిరంజీవితో మారుతి ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాక్. ఇటీవ‌ల ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ అందించాడు. ఇప్పుడు మ‌రోసారి మెగా ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని టాక్‌. సాయిధ‌ర‌మ్ తేజ్ - మారుతి కాంబినేష‌న్ లో ఓసినిమా రూపుదిద్దుకోనుంద‌ని టాక్‌.

 

వీరిద్ద‌రి కల‌యిక‌లో ఇది వ‌రకు `ప్ర‌తిరోజూ పండ‌గే` వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సూప‌ర్ హిట్టై.. తేజ్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అప్పుడే.. వీరిద్ద‌రూ మ‌రో సినిమా చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు తేజ్‌కి త‌గిన క‌థ‌ని మారుతి సిద్ధం చేశాడ‌ని టాక్‌. ప్ర‌స్తుతం కార్తీక్ వ‌ర్మ దండు అనే కొత్త ద‌ర్శ‌కుడితో తేజ్ ఓ సినిమా చేయ‌నున్నాడు. 2022 జ‌న‌వ‌రిలో సెట్స్‌పైకి వెళ్తుంది. దాంతో స‌మాంత‌రంగా మారుతితో సినిమా మొద‌ల‌య్యే ఛాన్సుంది.

ALSO READ: చిరు- ర‌వితేజ‌.. కాంబో ఫిక్స‌యిపోయిన‌ట్టే!