ENGLISH

మారుతితో చైతూ 'కాంబో' ఖాయమయ్యిందట

30 August 2017-19:19 PM

మారుతి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా ఓ సినిమా రాబోతోందనే గాసిప్స్‌ వినవస్తున్నాయి కొన్ని రోజులుగా. ఆ గాసిప్స్‌ నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మారుతి - నాగచైతన్య కాంబోలో సినిమా ఖరారయ్యిందని సమాచారమ్‌. త్వరలో ఈ సినిమా తాలూకు అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వస్తుందట. నాగచైతన్య 'యుద్ధం శరణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతుండగా, మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ లోగానే అక్కినేని కాంపౌండ్‌తో కాంట్రాక్ట్‌ కుదిర్చేసుకున్నాడు మారుతి. వరుస సక్సెస్‌లతో చైతూ దూకుడు మీదున్నాడు. యంగ్‌ హీరోస్‌తో మారుతి కాంబినేషన్‌ సూపర్‌ సక్సెస్‌ అని ఎప్పటికప్పుడే నిరూపితమవుతూ వస్తోంది. యంగ్‌ హీరో నానికి బీభత్సమైన బ్రేక్‌ ఇచ్చాడు మారుతి 'భలే భలే మగాడివోయ్‌' సినిమాతో. అప్పటి నుండీ నాని సక్సెస్‌కి బ్రేకులే లేవు. హిట్స్‌ మీద హిట్స్‌ కొట్టుకుంటూ రాకెట్‌ స్పీడుతో దూసుకెళ్లిపోతున్నాడు. ఇప్పుడు మరో యంగ్‌ హీరో శర్వానంద్‌ వంతు వచ్చింది. శర్వానంద్‌ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న 'మహానుభావుడు' సినిమాపైనా అంచనాలు బాగానే ఉన్నాయి. అలాగే చైతూ కూడా మారుతి డైరెక్షన్‌లో సూపర్‌ సక్సెస్‌ కొట్టేస్తాడేమో చూడాలిక.

ALSO READ: అర్జున్ రెడ్డి కథని కాపీ కొట్టారా?