ENGLISH

మెగా ప్రిన్స్‌తో సెన్సేషనల్‌ డైరెక్టర్‌

30 August 2017-19:14 PM

వరుస ఫ్లాప్‌ల మీదున్న డైరెక్టర్‌ తేజని అందరూ మర్చిపోయారనుకున్న టైంలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మళ్ళీ సక్సెస్‌ బాట పట్టాడు. ఒకప్పుడు తేజ అంటే సంచలనం. సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా తేజ తెలుగు సినీ పరిశ్రమలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. 'చిత్రం', 'జయం', 'నువ్వు నేను' సినిమాలతో టాప్‌ డైరెక్టర్‌ అయిపోయాడు. అయితే ఆ సక్సెస్‌లను కొనసాగించలేక వరుస పరాజయాల్ని చవిచూసిన తేజ, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో తిరుగులేని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే జోష్‌తో ఈ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ మరో సంచలనానికి తెరలేపుతున్నాడట. 'నేనే రాజు నేనే మంత్రి' ఇచ్చిన కొత్త ఉత్సాహంతో మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజతో ఓ సినిమాకి రంగం సిద్ధం చేశాడని సమాచారమ్‌. కథ ఓకే అయ్యిందనీ త్వరలో సినిమా సెట్స్‌ మీదకు వెళుతోందని గుసగుసలు వినవస్తున్నాయి. ఇది కూడా ఓ సెన్సేషనల్‌ కాన్సెప్ట్‌ అని టాక్‌ వినవస్తోంది. అలాగే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లకి మెగా ప్రిన్స్‌ ముందుంటాడు. మెగా ప్రిన్స్‌ ఓకే అన్నాడంటే ఆ కథపై ఖచ్చితంగా అంచనాలున్నాయి. 'కంచె' తరహా డిఫరెంట్‌ మూవీ కానుందని భావిస్తున్నారు ఈ సినిమా. ప్రస్తుతం 'ఫిదా'తో హిట్టు కొట్టిన వరుణ్‌తేజ్‌, 'నేనే రాజు నేనే మంత్రి'తో సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కిన తేజ కాంబినేషన్‌లో సినిమా ఖరారవ్వడం నిజమే అయితే, ఆ సినిమా ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలిక. త్వరలోనే ఈ కాంబినేషన్‌పై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారట.

ALSO READ: అర్జున్ రెడ్డి కథని కాపీ కొట్టారా?