ENGLISH

'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి' ధియేటర్లోకి వచ్చేశాడు

21 December 2017-11:13 AM

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎంసీఏ - మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి'. ఈ రోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ధియేటర్స్‌ వద్ద సందడి మామూలుగా లేదు. స్టార్‌ హీరోల సినిమాలకు సమానంగా సందడి నెలకొంది ధియేటర్స్‌ వద్ద. యంగ్‌ హీరో అయినప్పటికీ స్టార్‌ హీరోస్‌తో సమానంగా అభిమానం పెంచుకున్నాడు నాని. ఆ అభిమానం అంతా ఓపెనింగ్‌ డే ధియేటర్స్‌ వద్ద హంగామాతో స్పష్టమవుతోంది. ఇప్పటికే 'నేను లోకల్‌', 'నిన్ను కోరి' సినిమాలతో హిట్‌ అందుకున్నాడు ఈ ఏడాది. ఇప్పుడు 'ఎంసీఏ'తో వస్తున్నాడు.

ఈ సినిమాతో హ్యాట్రిక్‌ కొడతాననీ ముందే చెప్పాడు. అందుకు తగ్గట్లుగానే సినిమా ప్రోమోస్‌, జనంలోకి బాగా వెళ్లిపోయాయి. తెలంగాణా బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఎక్కువ భాగం వరంగల్‌లోనే షూట్‌ చేశారు. అంతేకాదు, చాలా కాలం తర్వాత జనం మధ్యన తెరకెక్కించిన సినిమా ఇది. అందుకే చాలా నేచురల్‌గా వచ్చిందట ఔట్‌ పుట్‌. 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవికిది రెండో సినిమా. ఈ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ తెలంగాణా అమ్మాయిగానే నటిస్తోంది. ఈ సినిమాకి నిర్మాత దిల్‌ రాజు. దిల్‌రాజు ప్రమోషన్స్‌ ఓ రేంజ్‌లో చేశాడు. ఈ ఏడాది అంతా దిల్‌రాజుకు బాగా కలిసొచ్చింది.

ఇప్పటికే ఒక హ్యాట్రిక్‌ కొట్టి, రెండో హ్యాట్రిక్‌తో రెడీగా ఉన్నాడు. దాన్ని ఈ సినిమాతో పూర్తి చేయనున్నాడు. ఇయర్‌ ఎండింగ్‌లో డబుల్‌ హ్యాట్రిక్‌తో దిల్‌ రాజు ఖుషీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రాధమికంగా అందుతున్న రిపోర్ట్స్‌ మంచి టాక్‌ని ప్రచారం చేస్తున్నాయి. చాలా కాలం తర్వాత సీనియర్‌ నటి భూమిక నటిస్తున్న చిత్రమిది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో 'ఎంసీఏ' తెరకెక్కింది. గతంలో దిల్‌ రాజు - వేణు శ్రీరామ్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'ఓ మై ఫ్రెండ్‌'. ఆ సినిమా తర్వాత ఇన్నాళ్లకు అదే కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి'.

ALSO READ: రిపీట్‌ అవుతున్న కుమారి కాంబో