ENGLISH

క్యూట్‌ క్యూట్‌గా మెగా డాటర్‌

30 November 2017-12:35 PM

మెగా హీరోయిన్‌ నిహారిక 'ఒక మనసు' సినిమాతో తెలుగులో మెగా ఎంట్రీ ఇచ్చింది. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఒకే ఒక హీరోయిన్‌గా నిహారిక ఈ సినిమాతో గ్రాండ్‌గా తెరంగేట్రం చేసింది. కానీ సినిమా మాత్రం విజయం సాధించకపోవడంతో, రేసులోంచి వెనక్కి వెళ్లిపోయింది. తన తదుపరి చిత్రం ఇంకా ఫిక్స్‌ కాలేదు. కానీ తమిళంలో అమ్మడు ఓ చిత్రంలో నటించింది. అదే 'ఒరునళ్ల నాల్‌ పాతు సొల్డ్రేన్‌'. ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. టీజర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ కార్తీక్‌ హీరోలుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. టీజర్‌ చూస్తుంటే ఒక భాగం మోడ్రన్‌ హైఫైగా అనిపిస్తోంది. మరో భాగం ట్రైబల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో కనిపిస్తోంది. సినిమా కథ, కథనాలు చాలా కొత్తగా ఉండబోతున్నాయని ఈ టీజర్‌ చూస్తుంటే తెలుస్తోంది. ఇందులో నిహారిక గెటప్‌ కూడా చాలా కొత్తగా ఉంది. చాలా క్యూట్‌గా ఉంది. మరో ముఖ్య విషయం ఏంటంటే, తమిళ టీజర్‌లో నిహారిక తెలుగులో డైలాగ్‌ చెబుతుండడం విచిత్రంగా ఉంది. 'అవును, అవును మామా..' అని నిహారిక తెలుగులో డైలాగ్‌ చెబుతోంది. ఆ సన్నివేశం ఆకట్టుకుంటోంది.

తెలుగులో తనకి తగ్గ స్టోరీ కోసం వేట మొదలుపెట్టింది నిహారిక. పలు స్టోరీలు విన్నది ఇప్పటికే ఈ మెగా బ్యూటీ. ఓ రీమేక్‌ చిత్రంలో నిహారిక నటించబోతోందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి కూడా. అయితే ఆ తర్వాత దాని గురించి సమాచారమ్‌ ఏం లేదు. తాజాగా ఈ తమిళ టీజర్‌ రావడంతో నిహారిక మళ్లీ వార్తల్లోకెక్కింది. మరో పక్క పలు వెబ్‌ సిరీస్‌లో కూడా నిహారిక నటిస్తోంది. ఒకవేళ నిహారిక నటించిన ఈ తమిళ సినిమాని తెలుగులో కూడా రిలీజ్‌ చేస్తారేమో చూడాలి!

ALSO READ: 'రోబో-2' కి అసలేమైంది?