ENGLISH

మెగా మ‌ల్టీస్టార‌ర్ల వెల్లువ‌

11 August 2020-12:00 PM

చిరంజీవి నుంచి వ‌చ్చిన మ‌ల్టీస్టార‌ర్లు చాలా త‌క్కువ‌. ఆమాట‌కొస్తే అస‌లు లేవ‌నే చెప్పాలి. చిరు ఇమేజ్ పెరిగాక‌, మెగాస్టార్ అయ్యాక‌.... మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌లు చేయ‌లేదు. అయితే ఇప్పుడు వ‌రుస‌గా చిరంజీవి నుంచి మ‌ల్టీస్టార‌ర్లే వ‌స్తున్నాయి.

చిరు ఇప్పుడు ఆచార్య లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. అంటే.. ఇది మెగా మ‌ల్టీస్టార‌ర్ అన్న‌మాట‌. లూసీఫ‌ర్ రీమేక్ కూడా అంతే. అందులో చిరంజీవితో పాటు మ‌రో హీరో కూడా క‌నిపిస్తారు. ఆయ‌న ఎవ‌ర‌న్న విష‌యంలో స్ప‌ష్ట‌త రావాలి. అంతేకాదు... చిరంజీవి కోసం ద‌ర్శ‌కుడు బాబి ఓ క‌థ ని రెడీ చేస్తున్నారు. ఇది కూడా మ‌ల్టీస్టార‌రే అని స‌మాచారం. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. ఈ సినిమాలో మెగా హీరోనే న‌టిస్తారా?  లేదంటే బ‌య‌టి హీరోకి ఛాన్స్ దొరుకుతుందా?  అనే విష‌యంలో ఆస‌క్తి నెల‌కొంది.

ALSO READ: నెక్స్ట్ సినిమా అదే అంటున్న ప్రశాంత్ వర్మ