ENGLISH

చిరంజీవికి క‌రోనా పాజిటీవ్‌

09 November 2020-12:00 PM

మెగాస్టార్ చిరంజీవికి క‌రోనా సోకింది. ఆయ‌న‌కు క‌రోనా పాటిటీవ్ గా నిర్దార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని చిరంజీవినే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ``ఆచార్య షూటింగ్ ప్రారంభించాల‌ని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజ‌ల్ట్ పాజిటీవ్‌. నాకు ఎలాంటి కోవిడ్ ల‌క్ష‌ణాలూ లేవు. వెంట‌నే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గ‌త 4 - 5 రోజులుగా న‌న్ను క‌లిసిన‌వాళ్లంతా టెస్ట్ చేయించుకోవాల్సింగా కోరుతున్నా. ఎప్ప‌టిక‌ప్పుడు నా ఆరోగ్య ప‌రిస్థితి మీకు తెలియ జేస్తా`` అని కొద్ది సేప‌టి క్రిత‌మే ట్వీట్ చేశారు. నిజానికి ఈరోజే ఆచార్య షూటింగ్ ప్రారంభం కావాలి.

chiranjeevi covid news

చిరంజీవి లేకుండానే కొన్ని స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌డానికి కొర‌టాల శివ ప్లాన్ చేశారు. వచ్చే వారంలో చిరంజీవి సెట్స్‌కి రావాలి. అయితే.. ఇప్పుడు చిరుకి క‌రోనా సోకిన నేప‌థ్యంలో.. షూటింగ్ మ‌రికొంత కాలం వాయిదా ప‌డే అవ‌కాశం వుంది.

ALSO READ: ప‌గ‌టి క‌ల‌లు కంటున్న మంజుల‌ మంజుల‌..