ENGLISH

బొద్దుగుమ్మ ‘మేఘా’ల్లో తేలిపోతోందే.!

06 November 2020-12:00 PM

కెరీర్‌లో ఇలా దూసుకొచ్చి.. అలా డల్‌ అయిపోయిన బొద్దుగుమ్మ మేఘా ఆకాష్‌. తెలుగులో ‘లై’, ‘ఛల్‌ మోహనరంగ’ సినిమాల్లో నటించిన మేఘా ఆకాష్‌ ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు అందుకోలేకపోయింది. మరోపక్క, తమిళ సినిమాలపై ఫోకస్‌ పెట్టి, టాలీవుడ్‌కి దూరమైన ఈ బ్యూటీ, ఇప్పుడిప్పుడే మళ్ళీ తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. సత్యదేవ్‌ సరసన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ, మరో రెండు తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోందట. టెలుగులో మళ్ళీ బిజీ అవుతుండడం చాలా ఆనందంగా వుందని మేఘా ఆకాష్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

 

తమిళ సినిమాలతో బిజీ అవడం వల్లే తెలుగు సినిమాలు చేయలేకపోయాననీ, ఇకపై వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తానని అంటోంది. ఓ పెద్ద హీరో సరసన కూడా నటించే అవకాశం వుందట మేఘా ఆకాష్‌. ఆ సినిమా ప్రస్తుతం చర్చల దశలో వుంది. అన్నట్టు తెలుగులో బ్యాక్‌ టు బ్యాక్‌ ఛాన్సులు ఇచ్చిన నితిన్‌తోనూ మేఘా ఆకాష్‌ ఓ సినిమా చేయబోతోందట. అన్నట్టు ఈ బ్యూటీ తెరపై ఇంకాస్త గ్లామర్‌ డోస్‌ పెంచే ఆలోచనలో కూడా వుందని సమాచారం. స్పెషల్‌ సాంగ్స్‌ చేయడానికైనా తాను సిద్ధమేనని చెబుతోంది మేఘా ఆకాష్‌.

ALSO READ: Megha Akash Latest Photoshoot