బాలయ్య వారసుడితో శ్రీలీల
నందమూరి నటసింహం వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ అఫీషియల్ గా ప్రకటించారు. ప్రశాంత్ వర్మ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి మంచి హైపు పెంచాడు ప్రశాంత్ వర్మ. త్వరలోనే ఈ మూవీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని సమాచారం. డెబ్యూ మూవీకి మోక్షు 20 కోట్లు పారితోషికం తీసుకుంటూ రికార్డ్ క్రియేట్ చేసాడు. ఈ మూవీ మిగతా డిటైల్స్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు మిగతా నటీ నటుల గూర్చి ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. మొన్నటివరకు మోక్షజ్ఞ పక్కన శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది అన్న ప్రచారం జరిగింది.
ఇప్పటికీ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ, అన్న ఎన్టీఆర్ సరసన టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇపుడు చెల్లి తమ్ముడితో టాలీవుడ్ కి పరిచయం అవుతోంది అని అంతా అనుకుంటున్న తరుణంలో ఈ మూవీలో ఇంకో హీరోయిన్ పేరు తెర పైకి వచ్చింది. వరుస డిజాస్టర్లతో ఫామ్ లో లేని శ్రీలీల మోక్షజ్ఞ మూవీలో ఛాన్స్ కొట్టేసినట్లు ఫిలిం నగర్ టాక్. బాలయ్యతో శ్రీలీల భగవంత్ కేసరి మూవీ చేసింది. తండ్రీ కూతుర్లుగా నటించిన వీరిద్దరి మధ్య స్పెషల్ బాండింగ్ ఏర్పడింది. అప్పట్లో బాలయ్య భగవంత్ కేసరి ఈవెంట్ లో నెక్స్ట్ సినిమాలో శ్రీలీలతో హీరోగా నటిస్తా నంటే మోక్షజ్ఞ ఒప్పుకోలేదని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. అంటే మోక్షజ్ఞ డెబ్యూలో శ్రీలీల హీరోయిన్ అని అప్పుడే హింట్ ఇచ్చారు బాలయ్య.
అయితే మోక్షజ్ఞ మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఖుషి కపూర్ పేరు వినిపించటంతో శ్రీలీల మాట మర్చిపోయారనుకున్నారు. పైగా శ్రీలీల వరుస ప్లాఫ్ లతో వెనకపడింది. అలాంటప్పుడు ఆమె కరక్ట్ ఛాయిస్ కాదని. కొత్త హీరోయిన్ అయితే మోక్షజ్ఞ కి బెటరని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు మళ్ళీ శ్రీలీల పేరు వినిపిస్తోంది. పైగా బాలయ్య , మోక్షజ్ఞ ల ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల. వీరిద్దరి జోడి చూడటానికి ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు.