ప్రతి శుక్రవారం సినిమా పండగే. వారం వారం థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అదే ఏమైనా అకేషన్స్ ఉంటే ఈ జోరు ఇంకొంచెం పెరుగుతుంది. అప్పుడు శుక్రవారంతో సంబంధం లేకుండా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. నార్మల్ గా దసరా, సమ్మర్, సంక్రాంతికి ఎక్కువసినిమాలు రిలీజ్ అవుతుంటాయి. సంక్రాంతికి ఈ పోటీ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. 2024 సంక్రాంతికి ఒకే సారి నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. నాగ్ , వెంకీ, రవి తేజ, తేజా సజ్జా లాంటి వాళ్ళు బరిలో నిలిచారు. 2025 సంక్రాంతికి అప్పుడే కర్చీఫ్ లు వేసేసారు. ఈ సారి పెద్ద హీరోలు రంగంలోకి దిగుతున్నారు.
టాలీవుడ్ లో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వరుసగా రిలీజ్ అవుతున్నాయి. మొదట ప్రభాస్ కల్కి మూవీతో మార్కెట్ స్టార్ట్ అయ్యింది. ఇపుడు దేవర రానున్నాడు. నెక్స్ట్ దీపావళికి కుభేర, డిసెంబర్ లో పుష్ప 2, గేమ్ చేంజెర్ వస్తున్నాయి. దీనితో మిగతా వారు సంక్రాతి బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు. ఈ సారి సంక్రాతి పోటీ గట్టిగా ఉండబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబో మూవీ 'విశ్వంభర' 10 జనవరి 2025 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఈ మధ్య కూడా అనౌన్స్ చేసారు. వెంకటేష్ , అనిల్ రావి పూడి కాంబో మూవీ సంక్రాతి బరిలో వస్తున్నట్టు ముందే అనౌన్స్ చేసారు.
బాలయ్య, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ మొదట సంక్రాంతికి అనుకున్నారు, కానీ తరవాత డిసెంబర్ లోనే రావాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిపారు. కారణం బాలయ్య అఖండ మూవీ డిసెంబర్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందుకనే డిసెంబర్ సెంటిమెంట్ కలిసి వస్తుంది, సంక్రాతికి పెద్ద సినిమాల రిలీజ్ కి లైన్ క్లియర్ చేసినట్టు ఉంటుందనుకున్నారు. కానీ ఇప్పడు బాలయ్య కూడా జనవరి 12 న వస్తున్నట్టు సమాచారం. ఒక నాగ్ తప్ప ముగ్గురు సీనియర్ హీరోలు సంక్రాతి బరిలో పోటీ పడుతున్నారు. చిన్న హీరోల్లో సందీప్ కిషన్ త్రినాధ్ నక్కిన కాంబో మూవీ కూడా సంక్రాంతికి రెడీ అవుతోంది.