ఎన్టీఆర్ 'దేవర' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఈ ఈవెంట్ క్యాన్సిల్ అందరినీ నిరుత్సాహానికి గురి చేసింది. కారణం ఫాన్స్ అనే చెప్పాలి. పాన్ ఇండియా మూవీగా దేవర తెరకెక్కుతుండటంతో ఎన్టీఆర్ అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయారు. వాటన్నిటికి చెక్ పెడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేసారు. హైదరాబాద్ హైటెక్స్ ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. నోవాటెల్ హోటల్ లో గ్రాండ్ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఫాన్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గేట్లు ఓపెన్ చేయగానే జనాలు మూకుమ్మడిగా హోటల్ లోకి తోసుకుని వచ్చేసారు.
జన సంద్రాన్ని, ఫాన్స్ అత్యుత్సహాన్ని సెక్యూరిటీ కంట్రోల్ చేయలేకపోయారు. ఈవెంట్ హాల్ లో బారికేడ్లు కూడా తోసేశారు. బ్యానర్లు చిరిగిపోయాయి. హోటల్ అద్దాలు పగిలిపోయి, జనాలు ఎక్కువై, తోపులాట జరిగింది. ఆడిటోరియం మొత్తం జనాలతో నిండిపోయి, పరిస్థితి చేయి దాటిపోయింది. గెస్ట్ ల కోసం చేసిన ఆరెంజ్ మెంట్స్ కూడా నాశనం చేసేసారు. దీనితో విధిలేక ఫాన్స్ సెక్యూరిటీ కోసం ఈవెంట్ ని రద్దు చేశారు. ఇండోర్ స్టేడియం లో ఈవెంట్ ప్లాన్ చేయటం వలన ఇలాంటి ఇబ్బంది వచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కేవలం 5 వేల మంది సరిపోయే ఆడిటోరియంలోకి 30 వేల మంది దూసుకు రావటంతో ఫాన్స్ భద్రతని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఈవెంట్ ని రద్దు చేసారు. ఎన్టీఆర్ ఫిలిం ఫెస్ట్ వెల్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లిపోతున్నారు. దీనితో ఇక తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ లేనట్లే. దీనితో శ్రేయాస్ మీడియా పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. వీటన్నిటికి సారీ చెప్తూ వారు ఒక పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో మాకు తెలుసు. ఫాన్స్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి అవుట్‌డోర్ వేదికను సెలక్ట్ చేద్దామనుకున్నాం కానీ పోలీసులు పర్మిషన్లు ఇవ్వలేదని ఆకారణంగానే ఇండోర్ లో ఈవెంట్ ప్లాన్ చేశామని తెలిపారు. ఫాన్స్ ని డిసప్పాయింట్ చేసినందుకు క్షమాపణలు చెప్పారు. ఫాన్స్ భద్రత కోసమే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు శ్రేయాస్ మీడియా.