ENGLISH

కార్తీ వ్యాఖ్యలపై పవన్ సీరియస్

24 September 2024-13:26 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది తిరుమల కల్తీ లడ్డూ వివాదం. స్వయంగా ఏపీ సీఎం తిరుమల స్వామి వారి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపారన్న ఆరోపణలు చేయటంతో ఈ వివాదం చిలికి చిలికి గాలి వాన అయింది. చివరికి సిట్ దర్యాప్తు వరకు వెళ్ళింది ఈ వ్యవహారం. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా టెస్టులు చేసి నేతిలో కల్తీ ఉన్నట్లు నిరూపించింది. వీటన్నికి పాప పరిహారంగా భక్తుల మనో భావాలకి భరోసా నిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. పవన్ వెంట మిగతా నాయకులు కూడా కొందరు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. 


సోమవారం కోలీవుడ్ హీరో కార్తీ సత్యం సుందరం మూవీ ప్రమోషన్స్ హైద్రాబాద్ లో నిర్వహించారు. ఈ సంధర్భంగా యాంకర్ కార్తీని లడ్డూ కావాలా నాయనా అన్ని అడగ్గా వద్దు , ప్రస్తుతం లడ్డూ గూర్చి మాట్లాడొద్దు. లడ్డు ఇపుడు సెన్సిటీవ్ టాపిక్ అన్ని కార్తీ కామెంట్ చేసారు.  పోనీ మోతి చూర్ లడ్డూ తెప్పిస్తామని యాంకర్ అనగా, అసలు ఏ లడ్డూ వద్దు అని లడ్డుని అవాయిడ్ చేయటం బెటరని కార్తీ వ్యాఖ్యానించారు. 


అయితే ఇదే విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయం శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ మీడియాతో మాట్లాడుతూ 'లడ్డు కల్తీ అనేది హిందువుల మనోభావాలకు సంబంధించిందని, తాజాగా ఓ సినిమా ఫంక్షన్ లో లడ్డు ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ అని జోకులు వేసి నవ్వుతున్నారు. ఇంకో సారి అలా జోక్ గా మాట్లాడకండి. యాక్టర్స్ ని గౌరవిస్తా కానీ ఇలాంటి విషయాలు సహించను అన్ని పవన్ మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని గౌరవించండి. ఏం మాట్లాడాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచించండి అని పవన్ హెచ్చరించారు.


కార్తీ లడ్డూ పై చేసిన కామెంట్స్ పై పవన్ సీరియస్ అవటంతో  కార్తీ వెంటనే స్పందించారు. X వేదికగా పవన్ కి సారీ చెప్పారు. ప్రియ‌మైన ప‌వ‌న్ క‌ల్యాణ్ సార్‌ నా మాటలు వలన ఊహించని పరిణామం ఏర్పడింది. అపార్థాలు చోటు చేసుకున్నాయి. నేను క్షమాపణ కోరుతున్నాను. నేను కూడా వేంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తుడినే. ఎప్పుడూ మ‌న సంప్ర‌దాయాల‌ను గౌర‌విస్తాను'. అని కార్తీ ట్వీట్ చేశారు.