ENGLISH

బిగ్‌హౌస్‌లో మోనాల్‌ యాత్ర ఎప్పటిదాకా.?

23 November 2020-17:00 PM

బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌ ప్రారంభమయినప్పటినుంచి ఇప్పటిదాకా, హౌస్‌లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా మోనాల్‌ గజ్జర్‌ కనిపించింది ఒకే ఒక్క సందర్భంలో.. అదీ అలేఖ్య హారిక కెప్టెన్స్‌ అయ్యే సమయంలో. అంతకు మించి, మోనాల్‌ చేసిందేమీ లేదు బిగ్‌ హౌస్‌లో.

 

తెలుగులో మాట్లాడటం నేర్చుకోవడమొక్కటే ఆమెకు బిగ్‌ టాస్క్‌ అన్నట్లుగా మారింది సీన్‌. అది కాకుండా, తొలుత అబిజీత్‌తో పులిహోర కలిపింది.. ఆ తర్వాత అఖిల్‌తో పులిహోర కలపడం కొనసాగిస్తోంది. మోనాల్‌ గజ్జర్‌ కారణంగానే అబిజీత్‌ - అఖిల్‌ మధ్య గొడవ జరుగుతోందన్నది నిర్వివాదాంశం. అయితే, అబిజీత్‌ తెలివిగా తప్పించుకున్నాడు. కానీ, మోనాల్‌ని సాకుగా చూపిస్తూనే అఖిల్‌, అబిజీత్‌ని నామినేట్‌ చేస్తూ వస్తున్నాడు. అందుకేనేమో, ఎక్కువ రోజులు మోనాల్‌ని బిగ్‌హౌస్‌లో కొనసాగిస్తున్నట్లున్నారు. తాజాగా లాస్య, బిగ్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది. మోనాల్‌తో పోల్చితే, లాస్య ఎంటర్‌టైనర్‌. కానీ, లాస్యను బయటకు పంపేశారు. ఇంకెన్నాళ్ళు మోనాల్‌ని హౌస్‌లో కొనసాగిస్తారు.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. 

 

టాప్‌ 5 వరకు మోనాల్‌ని కొనసాగించే అవకాశం వుండకపోవచ్చు. చివరి ఎపిసోడ్‌కి ముందు వారం మాత్రమే మోనాల్‌ని ఎలిమినేట్‌ చేస్తారనే చర్చ బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌లో జరుగుతోంది. లీకులు కూడా అందుకు అనుగుణంగానే వినిపిస్తుండడం గమనార్హం. గ్లామరస్‌ హీరోయిన్‌ అయి వుండీ.. తన స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్‌ ఆమె బిగ్‌హౌస్‌లో ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం.

ALSO READ: Monal Hot Photoshoot