ENGLISH

'మ‌నం' సీక్వెల్ ఉంటుందా?

23 November 2020-16:25 PM

అక్కినేని హీరోల్ని ఒకే వేదిక‌పై తీసుకొచ్చిన సినిమా `మ‌నం`. తెలుగులో అదో క్లాసిక్ అయ్యింది. లెజెండ‌రీ న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకి అదో గ్రేట్ సెండాఫ్ గా మారింది. ఈ సినిమా అంటే అక్కినేని అభిమానుల‌కు చాలా ప్ర‌త్యేకం. ఇప్పుడు `మ‌నం`కి సీక్వెల్ కూడా రాబోతోంద‌ని టాక్‌. ఈ సినిమాలో నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, అఖిల్‌ల‌తో పాటు స‌మంత కూడా క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తోంది.

 

ఈ సినిమా సీక్వెల్ లో తాను న‌టించ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని ఇటీవ‌ల స‌మంత చెప్పింది. దాంతో `మనం` సీక్వెల్ పై మ‌ళ్లీ ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. అయితే.. `మ‌నం` సీక్వెల్ అనుకున్నంత సుల‌భం కాదు. అక్కినేని లేకుండా.. `మ‌నం` సీక్వెల్ చూడ‌లేం. పైగా ఆ క‌థ సీక్వెల్ కి త‌గిన‌ది కాదు. `మ‌నం` లానే డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లే ఉంటే త‌ప్ప `మ‌నం` సీక్వెల్ కి న్యాయం చేయ‌లేరు. విక్ర‌మ్ ద‌గ్గ‌ర నిజంగా సీక్వెల్ కి స‌రిప‌డ స్క్రిప్టు ఉందా? లేదా? అనేది తెలిస్తే త‌ప్ప‌, దీనిపై క్లారిటీ రాదు.

ALSO READ: వెంకీ ఓకే... త‌రుణ్ హ్యాపీ!