ENGLISH

చెమటోడుస్తున్న మోనాల్‌.. హీరోయిన్‌ రోల్‌ కోసమేనా?

30 January 2021-11:00 AM

ఎప్పుడు ఎవరికి అదృష్టం ఎలా తలుపు తడుతుందో చెప్పలేం. ముద్దుగుమ్మ మోనాల్‌ గజ్జర్‌కి బిగ్‌బాస్‌తో అదృష్టం తలుపు తట్టింది. బిగ్‌బాస్‌ షోలో అమ్మడు చూపించిన టాలెంట్‌ అంటూ ఉంటే, ప్రతీ చిన్న విషయానికి కావేరి నది (ఏడుపు)కి కట్టలు తెంచేయడమే. సరే, అదే ఆమెకి పాపులారిటీ తెచ్చిపెట్టిందిలెండి. ఇకపోతే, బిగ్‌బాస్‌ ఇచ్చిన పాపులారిటీ బయటికొచ్చాక బాగా వర్కవుట్‌ అయ్యిందని చెప్పక తప్పదు. అప్పుడెప్పుడో హీరోయిన్‌గా నటించిన మోనాల్‌ మళ్లీ ఇప్పుడు చర్చల్లో నిలిచిందంటే హండ్రెడ్‌ పర్సంట్‌ అది బిగ్‌బాస్‌ అదృష్టమే.

 

ఇలా హౌస్‌ నుండి బయటికి వచ్చిందో లేదో, అలా 'అల్లుడు అదుర్స్‌' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి కేక పుట్టింది. తాజా అప్‌డేట్‌ ప్రకారం, మోనాల్‌ ఓ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుందని తెలుస్తోంది. ఆల్రెడీ బాలీవుడ్‌లో ఓ సినిమాలో నటిస్తోంది. లేటెస్ట్‌గా మరో సినిమాకీ సైన్‌ చేసిందట. తెలుగు, హిందీ సినిమాలతో పాటు, కన్నడ, తమిళ, మలయాళంలో కూడా ఆఫర్స్‌ వస్తున్నాయట. దాంతో మోనాల్‌ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. కాస్త బొద్దుగా కనిపించే మోనాల్‌ జీరో సైజ్‌ కోసం జిమ్‌ల చుట్టూ తిరుగుతోంది. కండలు కరిగించే పనిలో ఫుల్‌ బిజీగా ఉంది.

 

చెమటలు పట్టేలా కష్టపడుతూ, తన కష్టం అభిమానులకు తెలిసేలా వర్కవుట్‌ వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. పాపం మోనాల్‌ కష్టం చూసి, ఎందుకమ్మా కావేరి.. నీకింత కష్టం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అబ్బెబ్బే.. హీరోయిన్‌ ఆఫర్స్‌ అంటే, ఆ మాత్రం కష్టపడాలి కదా.. అంటూ మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.

ALSO READ: Monal Gajjar Photoshoot