అఖిల్ కథానాయకుడిగా నటించిన చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. పూజా హెడ్డే కథానాయిక. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పూర్తయి చాలా కాలమేఅయ్యింది. అయితే మధ్యలో కరోనా, లాక్ డౌన్ వల్ల విడుదల ఆగిపోయింది. రీషూట్లు కూడా జరిగాయి. అక్టోబరులో ఈ సినిమా విడుదల కానుందని ప్రచారం జరుగుతున్నా - ఆ సీజన్‌లో స్టార్ హీరోల సినిమాల జోరు ఎక్కువగా కనిపిస్తున్నందున.. ఆ పోటీ అఖిల్ తట్టుకుంటాడా, లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎట్టకేలకు బ్యాచిలర్ కి మోక్షం దక్కింది.
ఈసినిమాకి అక్టోబరు 8న విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ దసరాకి.. బ్యాచిలర్ వస్తున్నాడంటూ క్లారిఫై ఇచ్చింది. అయితే దసరా పోటీ మామూలుగా లేదు. అఖండ, అచార్య చిత్రాలూ దసరాకే రాబోతున్నాయంటూ సంకేతాలు అందుతున్నాయి. ఇవి కాకుండా.. మహా సముద్రం లాంటి మీడియం రేంజు సినిమాలూ ఉన్నాయి. మరి ఈ పోటీని బ్యాచిలర్ ఎలా ఎదుర్కుంటాడో ఏమో...?
ALSO READ: ఫ్యామిలీమెన్ 3లో సందీప్ కిషన్