ENGLISH

ఫ్యామిలీమెన్ 3లో సందీప్ కిష‌న్‌

27 August 2021-15:08 PM

భార‌తీయ వెబ్ సిరీస్ చరిత్ర‌లో.. ఫ్యామిలీమెన్ కు ఓ విశిష్ట‌మైన స్థానంఉంది. భార‌తీయుల‌కు వెబ్ సిరీస్ లో కొత్త రుచి చూపించిన సిరీస్ ఇది. సీజ‌న్ 1 సూప‌ర్ హిట్ట‌యితే, సీజ‌న్ 2 అంత‌కు మించిన విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు సీజ‌న్ 3కి క‌స‌ర‌త్తులు ప్రారంభించారు రాజ్ డీకే. సీజ‌న్ 2 కంటే భిన్నంగా, మిన్న‌గా ఉండాల‌న్న ప్ర‌య‌త్నంలో స్క్రిప్టుని ఓ రేంజ్ లో త‌యారు చేశార‌ని టాక్‌. ఈసారి.. ఈ సీజ‌న్ లో.. సందీప్ కిష‌న్ ఓ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

 

సీజ‌న్ 1లో సందీప్ ఓ కీ రోల్ లో క‌నిపించిన విష‌యం గుర్తుండే ఉంటుంది. సీజ‌న్ 2లో మాత్రం త‌న పాత్ర లేదు. అయితే 3 లో సందీప్ మ‌ళ్లీ క‌నిపించ‌బోతున్నాడు. రాజ్ డీకే, సందీప్ మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే సీజ‌న్ 1లో క‌నిపించాడు. ఇప్పుడూ అంతే. ఫ్యామిలీమెన్ 1లో సందీప్ పాత్ర చాలా చిన్న‌ది. అయితే ఈసారి త‌న పాత్ర‌కు మ‌రింత ప్రాధాన్యం ఇచ్చార్ట‌. 2022లో షూటింగ్ ప్రారంభం కానుంది. అదే యేడాది చివ‌ర్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సుంది.

ALSO READ: 'వివాహ భోజ‌నంబు' రివ్యూ & రేటింగ్!