పాపం అఖిల్.. అనుకోవడం తప్ప చేసేదేం లేదు. తన కెరీర్ అలా తయారైంది మరి. వినాయక్ లాంటి దిగ్గజ దర్శకుడి చేతిలో పెట్టినా.. `అఖిల్` కి అదృష్టం కలసి రాలేదు. హలో, మిస్టర్ మజ్ను.. రెండూ బోల్తా కొట్టేశాయి. తన ఆశలన్నీ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పైనే. అయితే ఈ సినిమా ఎప్పుడుబయటకు వస్తుందో ఇంకా స్పష్టం కాలేదు. దసరా బరిలో ఉంది అంటున్నా - ఇప్పటికీ... ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదన్నది ఇన్ సైడ్ టాక్.
అవును.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ ఇంకా అవ్వలేదట. ఈ సినిమాని ఇంకా చెక్కుతూనే ఉన్నారని తెలుస్తోంది. ఇది వరకే ఈ సినిమా రీషూట్లకు వెళ్లింది. దాదాపు 15 నిమిషాల సన్నివేశాల్ని మళ్లీ.. తీశారు. ఇప్పుడు మరోసారి రీషూట్లు జరుపుకుంటోందట. అటు అల్లు అరవింద్, ఇటు నాగార్జున.. ఇద్దరూ కొన్ని కరెక్షన్లు చెప్పడంతో రీషూట్లు తప్పడం లేదని తెలుస్తోంది. ఇలాగైతే.. ఈ సినిమా దసరాకి రావడం కూడా కష్టమే అంటున్నారు సినీ జనాలు. ఎన్ని రీషూట్ల చేసినా అంతిమ లక్ష్యం.. మంచి సినిమా ఇవ్వడమే. అదే జరిగితే... ఈ రీషూట్లనీ, కష్టాన్నీ... అక్కినేని అభిమానులు మర్చిపోతారు.
ALSO READ: వీరయ్య కాదు... వాల్తేర్ శీను