ENGLISH

థియేటర్ బిజినెస్ లోకి మైత్రీ మూవీస్

28 March 2024-14:10 PM

టాలీవుడ్ లో ప్రజంట్ ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. ఈ సంస్థ చిన్న  సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ నిర్మాణ రంగం లో దూసుకుపోతున్నారు. మహేష్ బాబు నటించిన "శ్రీమంతుడు" సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, జనతా గ్యారేజ్, రంగస్థలం, పుష్ప లాంటి క్రేజ్ ప్రాజెక్ట్స్ నిర్మాణంతో వరస విజయాలు అందుకున్నారు. లాభాల బాటలో నడుస్తున్న ఈ సంస్థ ఇప్పుడు ఇతర ఇండస్ట్రీల మీద ద్రుష్టి సారించినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్ లో కూడా అడుగు పెట్టి, పాన్ ఇండియా సంస్థగా రూపొందించాలని ప్లాన్ చేసుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.


నిర్మాణ రంగంలో అజేయంగా దూసుకుపోతున్న మైత్రీ మూవీస్ తరవాత డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టి సలార్, హనుమాన్ లాంటి  సినిమాలు రిలీజ్ చేసి. బిగ్గెస్ట్ హిట్స్ అందుకుంది. నిర్మాణ రంగం, డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఇప్పుడు థియేటర్ బిజినెస్ లోకి  కూడా అడుగుపెడుతోంది. థియేటర్ బిజినెస్ నేమ్ కూడా 'మైత్రీ సినిమాస్' అని   ప్రకటించింది. ఇందుకోసం ఏపీ, తెలంగాణల్లో సింగిల్ స్క్రీన్లు ఉన్న థియేటర్స్ ని లీజుకు తీసుకుని వర్క్ మొదలు పెట్టినట్లు సమాచారం.  AP లో మొదటగా గుంటూరులో మైత్రి సినిమాస్ పేరుతో మార్చి 29 న మల్టీప్లెక్స్ ఓపెన్ చేస్తున్నారని, తెలుస్తోంది.                     


మైత్రీ మూవీస్ ప్రజంట్ అల్లు అర్జున్ తో పుష్ప ది రూల్, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ తో  RC16, RC17 సినిమాలు,  ప్రభాస్,హను రాఘవపూడి కాంబో మూవీ, కోలీవుడ్ లో అజిత్ తో ఒక సినిమా, బాలీవుడ్ లో సల్మాన్ తో ఒక మూవీని నిర్మిస్తోంది. థియేటర్ బిజినెస్ లో కూడా ఇంకెన్ని విజయాలు అందుకుంటుందో చూడాలి.