ENGLISH

టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ & రేటింగ్

29 March 2024-12:20 PM

చిత్రం: టిల్లు స్క్వేర్

నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ 

దర్శకత్వం: మల్లిక్ రామ్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ & సాయి సౌజన్య
 
సంగీతం: రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్
ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
కూర్పు: నవీన్ నూలి

బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
విడుదల తేదీ: 29 మార్చి 2024

 
ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 3.25/5


స్టార్ అవ్వడానికి ఒక్క సరైన హిట్టు చాలు. అలాంటి హిట్టు 'డిజే టిల్లు' రూపంలో పడింది సిద్దు జొన్నలగడ్డకి. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఆ సినిమా విజయంతో సిద్దు స్టార్ బాయ్ అయ్యాడు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ టిల్లు మ్యాజిక్ రిపీట్ అయ్యిందా? 


క‌థ‌: దేవరకొండ బాలగంగాధర తిలక్ అలియాస్ డిజే టిల్లు (సిద్దు జొన్నలగడ్డ) 'టిల్లు' ఈవెంట్స్ పేరుతో బిజినెస్ మొదలుపెడతాడు. సిటీలో ఎలాంటి వేడుకలు జరిగినా టిల్లు డిజే కొట్టాల్సిందే. అనుకోకుండా ఓ రోజు ఓ పార్టీలో లిల్లీ ( అనుపమ పరమేశ్వరన్) టిల్లుకు పరిచయమౌతుంది. తొలి పరిచయంలోనే ఇద్దరూ ఫిజికల్ గా దగ్గరౌతారు. ఆ మరుసటి ఉదయమే లిల్లీ కనిపించకుండాపోతుంది. అసలు లిల్లీ ఎక్కడికి వెళ్ళింది? లిల్లీ ఎవరు? టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది?ఆమె మళ్ళీ టిల్లుకి కనిపించిందా? ఆమె రాకతో టిల్లు ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నాడు? అనేది తక్కిన కథ.  


విశ్లేషణ: డిజే టిల్లు సినిమా విజయం సాధించడానికి ప్రధాన కారణం టిల్లు పాత్రనే. టిల్లు రాధిక( నేహ శెట్టి)ల కెమిస్ట్రీ ప్రేక్షకులని విపరీతంగా అలరించింది.  టిల్లు స్క్వేర్ ని కూడా అదే స్టయిల్ లో ప్రజెంట్ చేశాడు దర్శకుడు. పార్ట్ వన్ ని గుర్తు చేస్తూనే ప్రతి సీక్వెన్స్ ముందుకు వెళుతుంటుంది. రెండో పార్ట్ లో లిల్లీగా అనుపమ టిల్లు జీవితంలోకి వస్తుంది. అక్కడ నుంచి టిల్లు ఎదురయ్యే అనుభవాలు మరీ కొత్తగా కాకపోయినా చాలా చోట్ల నవ్వించేలా వుంటాయి. అయితే రాధిక టిల్లు మధ్య కుదిరినంత కెమిస్ట్రీ లిల్లీ టిల్లు మధ్య కనిపించలేదు. లిల్లీకి ఎదో గతం వుంటుందని అర్ధమౌతూనే వుంటుంది. అది రివిల్ అయ్యే ఇంటర్వెల్ ఎపిసోడ్ లో చంద్రముఖి పాట వాడకం బావుంది. 


సెకండ్ హాఫ్ లో సాలు కథ తెరపైకి వస్తుంది. ఓ పేరు మోసిన క్రిమినల్ ని చంపడానికి వేసిన లడ్డూలో ప్లాన్ నవ్వులు పూయిస్తుంది. డిజే టిల్లు సెకండ్ హాఫ్ లో సమస్య కథ లేకపోవడం. టిల్లు స్క్వేర్ సెకండ్ హాఫ్ లో కథ వుంది కానీ అది అంత బలంగా వుండదు. చాలా వరకూ సీన్లు సాదాసీదాగా సాగిపోతుంటాయి. లిల్లీ పాత్రలో ఓ ట్విస్ట్ వుంది కానీ అది అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఇందులో రాధిక ఎంట్రీ కూడా వుంది. ఆమె ఎంట్రీకి థియేటర్స్ లో క్లాప్స్ పడ్డాయంటే అర్ధం చేసుకోవచ్చు ఆ పాత్ర ఎంతలా జనాల్లోకి వెళ్లిందో. 


నటీనటుల నటన: టిల్లు స్క్వేర్  సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో. సినిమాని తన భుజాలతో పై ఎత్తుకున్నాడు. తను నుంచి వచ్చిన సింగిల్ లైనర్స్ నవ్విస్తాయి. తన స్క్రీన్ ప్రజెన్స్, కామెడీ టైమింగ్, కాస్ట్యూమ్స్ ప్రతిది ఆకట్టుకునేలా వుంటుంది.  లిల్లీగా చేసిన అనుమప తన ఇమేజ్ కి భిన్నంగా కనిపించింది. రాధికతో పోల్చుకుంటే నిరాశ తప్పదు. టిల్లు తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ మరోసారి అలరించారు. మార్కస్ కామెడీ బావుంది. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.

 

సాంకేతిక వ‌ర్గం: రామ్ మిర్యాల అందించిన పాటలు, చిత్రీకరణ బావుంది.  భీమ్స్ అందించిన నేపధ్య సంగీతం ట్రెండీగా వుంది.  సాయి ప్రకాష్ కెమరాపనితనం నీట్  గా వుంది.  నిర్మాణ విలువలు డీసెంట్ గా  అనిపిస్తాయి. నవ్వించే మాటలు రాసుకున్నారు. టిల్లు పలికిన దాదాపు డైలాగ్స్ నవ్విస్తాయి.  


ప్లస్ పాయింట్స్ 
టిల్లు క్యారెక్టర్ 
సింగిల్ లైనర్స్ 
ట్రెండీ టేకింగ్, బీజీఎం


మైనస్ పాయింట్స్ 
కథలో బలం లేకపోవడం  
లిల్లీ పాత్రలో కొరవడిన సహజత్వం 
కొన్ని చోట్ల రొటీన్ కామెడీ


ఫైనల్ వర్దిక్ట్: టిల్లు.. నవ్విస్తాడు..

ALSO READ: REVIEW IN ENGLISH