ENGLISH

ఈ గ్లామర్‌కి పరిచయం కావాలి బాస్‌.!

29 August 2018-17:51 PM

పొట్టి గౌనులో క్యూట్‌ స్మైల్‌ ఇస్తూ, కొంచెం హాట్‌గా వయ్యారాలు పోతున్న ఈ బ్యూటీ పేరు నభా నటేష్‌. ఇంకా పరిచయం కాలేదు తెలుగులో. త్వరలో రాబోతోంది. సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'నన్ను దోచుకుందువటే' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు క్రియేటివ్‌ డైరెక్టర్‌ రవిబాబు తెరకెక్కిస్తోన్న 'అదుగో' చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. అదేనండీ పంది పిల్ల హీరోగా తెరకెక్కుతోంది కదా ఆ సినిమానే. తెలుగులో ఈ రెండు సినిమాలే. కానీ కన్నడలో ఆల్రెడీ ఓ రెండు సినిమాల్లో నటించేసింది. తెలుగులో అమ్మడి టాలెంట్‌ చూడాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే ఇటీవల విడుదలైన 'నన్ను దోచుకుందువటే' ట్రైలర్‌లో ఆల్రెడీ ఈ బ్యూటీ టాలెంట్‌ జస్ట్‌ శాంపిల్‌గా చూసేశాం. 'సిరి' అనే కొంటెపిల్ల పాత్రలో బ్యూటీ ఫస్ట్‌ ఇంప్రెషన్‌ అయితే ఇచ్చేసింది. చూడాలి మరి ఫుల్‌ డోస్‌ ఎలా ఉండబోతోందో.!