ENGLISH

చైతూ - సామ్ మళ్ళీ కలవనున్నారా!?

09 February 2024-18:12 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ జంట నాగ చైతన్య, సమంత. సినిమాలో జోడి అయినా, బయట జోడి అయినా వీరికి ఫుల్ పాపులారిటీ ఉంది.  చైతు ఎంతమందితో యాక్ట్ చేసినా, సామ్ తో కలిసి నటించినంత కిక్ రాదు ఆడియన్స్ కి.  వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయినప్పుడు ఎంతగా సంబరాలు చేసుకున్నారో, వాళ్ళు విడిపోయినప్పుడు అంతగా బాధపడ్డారు. ఇప్పటికీ వీరిద్దరూ మళ్ళీ కలవాలని కోరుకుంటున్నవారు కోకొల్లలు. ప్రజంట్ ఎవరి కెరియర్ లో వారు బిజీగా ఉన్నారు.  సమంత  తెలుగులోనే కాకుండా కోలీవుడ్ , బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. చైతూ కూడా రీసెంట్ గా దూత వెబ్ సిరీస్ తో హిట్ అందుకుని నటనా పరంగా మంచి  మార్కులు సంపాదించాడు.


ఎవరెన్ని సినిమాలు చేసినా హిట్స్ వచ్చినా, చై - సామ్ లు కలిసి మళ్ళీ నటిస్తే చూడాలని ఫాన్స్ కోరిక.  ఈ క్రమంలోనే వీరిద్దరూ మళ్ళీ కలుస్తున్నారనే వార్త ఫాన్స్ ని  ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.  నాగ చైతన్య రీసెంట్ గా  దూత  అనే వెబ్ సీరీస్ తో అలరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సిరీస్ కి సీక్వల్ కూడా  ప్లాన్ చేస్తున్నారని,  ఇందులో సమంతని  ఓ కీలక పాత్ర కోసం సంప్రదించగా, ఆమె  కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీనిపై త్వరలోనే అఫీషియల్  అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.
  

సామ్ చైతులది సూపర్ హిట్ జోడి. వీరి కాంబినేషన్లో వచ్చిన ఏం మాయ చేసావో, మనం, మజిలీ అన్ని కూడా బ్లాక్ బస్టర్లే, అలాంటిది మళ్ళీ వీరిద్దరూ కలిసి నటిస్తే సూపర్ హిట్  ఖాయమంటున్నారు సినీ లవర్స్.  సినిమా కోసం పర్సనల్ ఫీలింగ్స్ ని పక్కన పెట్టి ఒక్కటైన ఈ జంట లైఫ్ లో కూడా మళ్ళీ కలవాలని కోరుకుంటున్నారు.