ENGLISH

ఈగల్‌ మూవీ రివ్యూ & రేటింగ్

09 February 2024-11:49 AM

చిత్రం: ఈగల్‌

నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్

దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల

 
సంగీతం: దవ్‌జాంద్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, కర్మ్ చావ్లా, కమిల్ ప్లోకీ
కూర్పు: కార్తీక్ ఘట్టమనేని

బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 9 ఫిబ్రవరి 2024


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.75/5


అన్ని అనుకున్నట్లు జరిగుంటే రవితేజ 'ఈగల్'ని ప్రేక్షకులకు సంక్రాంతికే చూసేవారు. ఐతే థియేటర్స్ రద్దీ కారణంగా సినిమా వెనక్కి తగ్గింది. ఇప్పుడు సోలో రిలీజ్ అనలేం కానీ పెద్ద సినిమాల్లో సింగిల్ గానే వచ్చింది ఈగల్. సూర్య వెర్సస్ సూర్య సినిమాతో ఆకట్టుకున్న కార్తిక్ ఈ సినిమాకి దర్శకుడు. ప్రచార చిత్రాల్లో మాస్ స్టయిలీష్ యాక్షన్ కనిపించింది ? మరా యాక్షన్ ప్రేక్షకులకు నచ్చిందా ? అసలు ఈగల్ కథ ఏమిటి? 


కథ: న‌ళిని(అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) ఓ ప్రతికలో జ‌ర్నలిస్ట్. ఆమె రాసిన ఓ క‌థ‌నం దేశంలో సంచలనం సృష్టిస్తుంది. ఇన్వెస్టిగేష‌న్ బృందాలు, న‌క్సలైట్లు, తీవ్రవాదుల ముఠాల్లో కదలిక వస్తుంది. ఈ కథనం చిత్తూరు జిల్లా త‌ల‌కోన లోని స‌హదేవ్ వ‌ర్మ (ర‌వితేజ‌) అనే ఓ పత్తిరైతు గురించి. అసలు ఈ స‌హ‌దేవ్ వ‌ర్మ ఎవ‌రు? అత‌ని గ‌త‌మేమిటి ? అతనికోసం ఇన్వెస్టిగేష‌న్ బృందాలు, న‌క్సలైట్లు, తీవ్రవాదుల ఎందుకు గాలిస్తున్నారు? అనేది తక్కిన కథ. 


విశ్లేషణ: జ‌ర్నలిస్ట్ న‌ళిని రాసిన క‌థ‌నంతో మొద‌ల‌వుతుందీ క‌థ‌.  అసలు సహదేవ్ ఎవరు ? అతని గురించి నళిని తెలుసుకునే క్రమంలో కలసిన పాత్రలు, వాళ్ళు చెప్పే సన్నివేశాలతో ఆసక్తిగానే ముందుకు సాగుతుంది. అయితే రానురాను కథలో అనవసరమైన బ్లిల్దప్పులు ఎక్కువైపోతున్నయనే భావన కలుగుతుంది. కేవలలం డైలాగులు, ఇంట్రోలతోనే కాలయాపన చేసే వైనం కనిపిస్తుంది. కథ ఎంతకీ మొదలుకాకపోవడంతో తెరపై జరుగుతున్న సన్నివేశాల్లో, పాత్రల ఎమోషన్ ని ప్రేక్షకులకు పట్టదు. ఒక దశలో పాత్రలు వాళ్ళు ఇచ్చిన అనవసరమైన బిల్డప్పులు గంధరగోళానికి దారితీస్తాయి. 


ఒక ఆర్టికల్ ని చూసి 'రా' ఎందుకంత హడాలిపోతుంది? అతని గురించి సమాచారం చుట్టుపక్కల వున్న వారికి తెలిసినప్పుడు అదేదో దేవరహస్యంలా ఎందుకు తెగ గింజుకుంటుందనేది లాజిక్ కి దూరంగా వుంటుంది. నిజానికి ఈగిల్ కథలో వుండే ఉద్దేశం మంచిదే. అర్హులైన వారి దగ్గరే ఆయుధం వుండాలనే ఆలోచన బావుంది. కానీ ఆ ఆలోచనని తెరపైకి తెచ్చిన తీరు సరిగ్గా కుదరలేదు. సెకండ్ హాఫ్ లో కూడా కథ రక్తికట్టలేదు. రొటీన్ లవ్ ట్రాక్ మరో మైనస్ గా మారింది. అయితే క్లైమాక్స్ యాక్షన్ సీన్ చక్కగా తీశారు. రవితేజ మాస్ విశ్వరూపం చూపించారు. అలాగే అమ్మోరు విగ్రహంతో గన్ ఫైర్ చేయించిన సీన్ బావుటుంది.     


నటీనటుల తీరు:  రవితేజ నయా మాస్ అవతార్ లో కనిపించారు. రవితేజ కి ఇది డిఫరెంట్ గెటప్. ఆయన డైలాగుల్లో ఇంటెన్స్ వుంది. అలాగే యాక్షన్ సీన్స్ ని కూడా హుషారుగా చేశారు. అనుప‌మ‌ కథని ముందుకు తీసుకెళ్ళే పాత్రలో కనిపించింది.  కావ్య థాప‌ర్ నటన ఓకే. న‌వ‌దీప్ చెప్పిన డైలాగులు మరీ టు మచ్ సినిమాటిక్ అనిపిస్తాయి. అజ‌య్ ఘోష్‌, శ్రీనివాస‌రెడ్డి, మిర్చి కిర‌ణ్  పంచిన డార్క్ కామెడీ అక్కడక్కడ నవ్విస్తుంది. విన‌య్‌రాయ్‌, మ‌ధుబాల, శ్రీనివాస్ అవ‌స‌రాల పరిధిమేర కనిపించారు.


టెక్నికల్: మంచి ప్రొడక్షన్ డిజైన్ కనిపించింది. డేవ్ జాండ్ నేపధ్య సంగీతం ఎఫెక్టివ్ గా చేశారు.  కెమెరాపని తీరు డీసెంట్ గా వుంది. యాక్షన్ సీన్స్ ని చాలా చక్కగా తీశారు. మంచి స్టయిలీష్ మేకింగ్ కనపరిచారు. మాటల విషయానికి వస్తే.. మరీ సినిమాటిక్ గా ఓవర్ డ్రమటిక్ గా రాసేశారు. కార్తిక్ ఘ‌ట్టమ‌నేని టేకింగ్ బావుంది, అయితే కథలోని ఎమోషన్ పై ఇంకాస్త ద్రుష్టి పెడితే బావుండేది. 


ప్లస్ పాయింట్స్ 
రవితేజ 
యాక్షన్ 
నిర్మాణ విలువలు 


మైనస్ పాయింట్స్ 
కథ, కథనం 
ఎమోషన్ మిస్ కావడం 
అనవసరమైన ఎలివేషన్లు 


ఫైనల్ వర్దిక్ట్ : 'ఈగిల్' ఇంకా ఎగరాల్సింది...