ENGLISH

షాకింగ్ కాంబో సెట్ చేసిన చైతూ..?

30 October 2020-14:00 PM

నిజంగా ఇది షాకింగ్ కాంబినేష‌నే. బ‌హుశా ఎవ‌రూ ఊహిచి ఉండ‌రు. ఎవ‌రి ఊహ‌ల‌కూ అంద‌కుండా అప్పుడ‌ప్పుడూ టాలీవుడ్ లో విచిత్రాలు జ‌రుగుతుంటాయి. అలాంటి వాటిలో ఇదొక‌టి అనుకోవొచ్చు.

 

యాక్ష‌న్ కింగ్ అర్జున్ గుర్తున్నాడు క‌దా.? జెంటిల్‌మెన్ లాంటి సినిమాల‌తో త‌న త‌డాఖా చూపించిన న‌టుడు. త‌న‌కు ద‌ర్శ‌క‌త్వంపైనా ప‌ట్టుంది. అయితే చాలా కాలంగా డైరెక్ష‌న్‌కి దూరంగా ఉన్నాడు. తెలుగులో సినిమాలు కూడా చేయ‌డం లేదు. అయితే ఇప్పుడు ఓ క‌థ త‌యారు చేసుకున్నాడ‌ట‌. తెలుగులోనే సినిమా చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. అందులో భాగంగా నాగ‌చైత‌న్య‌ని క‌లిసి ఈ క‌థ చెప్పాడ‌ని టాక్‌.చైతూకి కూడా ఈ క‌థ బాగా న‌చ్చింద‌ని, పూర్తి స్క్రిప్టు త‌యారు చేయ‌మ‌ని అర్జున్‌కి చెప్పాడ‌ని, అన్నీ కుదిరితే ఈ కాంబో సెట్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. క‌థ న‌చ్చితే ఏముంది? ఏ హీరో అయినా, ఎవ‌రితో అయినా ప‌నిచేస్తాడు. పైగా అర్జున్ డైరెక్ష‌న్ అంటే ఇంకాస్త క్రేజ్‌వ‌స్తుంది. యాక్ష‌న్ కింగ్ తో.. కింగ్ కొడుకు సినిమా అంటే.. చెప్పుకోవ‌డానికీ, విన‌డానికీ బాగుంటుంది క‌దా..?

ALSO READ: అమీర్‌ఖాన్‌కు కొత్త త‌ల‌నొప్పి