ENGLISH

'RX100' పై హాట్ కామెంట్స్ చేసిన నాగార్జున

02 August 2018-16:57 PM

ఈమధ్య కాలంలో విడుదలైన చిత్రాలలో RX 100 చిత్రం భారీ విజయం సాధించింది. అయితే ఈ సినిమా కథ, కథనం విషయంలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరధం పట్టారు అనే చెప్పాలి.

ఇక ఈ చిత్రం పై ప్రశంసలు కురిపించిన ప్రముఖుల జాబితాలో కింగ్ నాగార్జున చేరాడు. ఆయన సమర్పిస్తున్న చిలసౌ చిత్ర ప్రెస్ మీట్ లో విలేఖరులతో మాట్లాడుతూ- నేను ఈమధ్యనే RX 100 సినిమాకి సంబందించిన ఆఖరి రెండు రీల్స్ మా స్టూడియోలో చూసాను. నాకు సినిమా చాలా బాగా నచ్చింది అదే సమయంలో సినిమా రైటింగ్ కూడా చాలా బాగుంది.

ఆ రెండు రీల్స్ చూసినప్పటి నుండి మొత్తం సినిమా ఎప్పుడు చూడాలి అన్న ఆత్రుత మొదలైంది. త్వరలోనే సినిమా చూస్తాను, అదే సమయంలో ఈ సినిమా పైన నెగటివ్ టాక్ కూడా విన్నాను. అయితే ఇది అడల్ట్ సినిమా అందుకే A రేటింగ్ ఇచ్చారుగా. నాకైతే బాగా నచ్చింది అంటూ ముగించేశాడు.

కింగ్ మాటలు RX 100 చిత్ర యూనిట్ కి దర్శకుడికి మంచి బూస్టింగ్ లా పనిచేస్తాయి అని చెప్పొచ్చు.

 

ALSO READ: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన త్రిష.!