ENGLISH

ఎన్టీయార్‌ ఎనర్జీకి నాగార్జున 'బిగ్‌' కాంప్లిమెంట్‌

28 July 2017-15:26 PM

బిగ్‌బాస్‌ షోని అద్భుతంగా హోస్ట్‌ చేస్తున్నందుకుగాను యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌కి 'కింగ్‌' నాగార్జున 'బిగ్‌' కాంప్లిమెంట్‌ ఇచ్చారు. హోస్ట్‌గా ఎన్టీయార్‌ ఎనర్జీ సూపర్బ్‌గా ఉందని సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ చేశారు నాగార్జున. నాగార్జున కాంప్లిమెంట్‌ పట్ల ఎన్టీయార్‌ స్పందించాడు. 'థాంక్యూ ఎ లాట్‌ బాబాయ్‌' అంటూ నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపాడు ఎన్టీయార్‌. తొలి వీకెండ్‌ తనదైన ఎనర్జీతో అదరగొట్టేసిన ఎన్టీయార్‌, రెండో వీకెండ్‌కి సమాయత్తమవుతున్నాడు. శని, ఆదివారాల్లో 'బిగ్‌బాస్‌' షోని ఎన్టీయార్‌ అదరగొట్టేస్తున్న సంగతి తెలిసినదే. ఐదు రోజులపాటు డల్‌గా సాగుతున్నా, వీకెండ్‌లో ఈ షోకి అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తోందంటే దానిక్కారణం ఎన్టీయారే. ఫుల్‌ ఎనర్జీని తీసుకొస్తున్నాడు ఎన్టీఆర్‌, ఆ రెండు రోజుల్లోనూ ఈ షోకి. స్టార్‌డమ్‌ని పక్కన పెట్టేసి, అభిమానుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ, హౌస్‌ మెంబర్స్‌ని అందరినీ పేరు పేరునా వారి వారి టాస్క్‌లకు సంబంధించిన హైలైట్స్‌ని గుర్తు చేస్తూ టోటల్‌ షోని ఇంట్రెస్టింగ్‌గా మార్చేస్తున్నాడు. మరి అలా చేస్తున్న ఎన్టీఆర్‌కి కాంప్లిమెంట్స్‌ ఎన్నిచ్చినా తక్కువే అవుతాయి. ఫస్ట్‌ వీక్‌ 'బిగ్‌బాస్‌' షోని చూసిన ఆడియన్స్‌ అబ్బే ఇలా అయితే కష్టమే అనుకున్నారు. కానీ ఎన్టీఆర్‌ కోసం వీక్‌ మొత్తం చూసేలా ఓ స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశాడు. ఇక సెకండ్‌ వీక్‌ కూడా రానే వచ్చింది. ఈ సెకెండ్‌ వీక్‌లో ఎన్టీఆర్‌ ఏం మాయ చేస్తాడో చూడాలిక. 

 

ALSO READ: గౌత‌మ్ నంద‌ మూవీ రివ్యూ & రేటింగ్స్