ENGLISH

'మన్మధుడు 2'లో నాగ్‌ హై ఓల్టేజ్‌ యాక్షన్‌.!

27 April 2019-11:10 AM

నాగార్జున కమిట్‌మెంట్‌ చర్చనీయాంశమైంది. వయసుకు మించి కష్టపడుతున్నాడు నాగార్జున. వయసులో ఉన్నవాళ్లు చేసే ఫీట్లు చేస్తున్నాడు. పోర్చుగల్‌లో 'మన్మధుడు 2' షూటింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్‌లో భాగంగా నాగార్జున చేస్తున్న వర్కవుట్స్‌ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ వయసులో కూడా ఆయన మెయింటైన్‌ చేస్తున్న ఫిజిక్‌, హ్యాండ్‌సమ్‌ లుక్స్‌ పిచ్చెక్కించేస్తున్నాయి. ఈ సినిమా కోసం నాగార్జున మేకోవర్‌ అందరికీ షాక్‌ తెప్పిస్తోంది. 

 

ఇటీవల'ఆఫీసర్‌', దేవదాస్‌ సినిమాలు నాగ్‌కి ఆశించిన రిజల్ట్‌ ఇవ్వలేకపోయాయి. కానీ ఈ సినిమాపై మాత్రం అంచనాలున్నాయి. నాగ్‌ లుక్సే అందుకు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. రొమాంటిక్‌ లవ్‌స్టోరీతో పాటు, యాక్షన్‌ ప్యాకెడ్‌ మూవీగా 'మన్మధుడు 2' రూపొందుతోంది. ఇక పోర్చుగల్‌ షూటింగ్‌లో భాగంగా, చెట్టుకు స్టాండ్‌ అయ్యి నాగార్జున చేస్తున్న ఫీట్స్‌కి సంబంధించి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫీట్స్‌ని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కూడా చేసింది. 

 

అయితే రకుల్‌ది ఏక్రోబాటిక్‌ బాడీ కాబట్టి ఎలాంటి ఫీట్స్‌ అయినా ఈజీగా చేసేయగలదు. కానీ నాగార్జున వయసు రీత్యా ఇలాంటి ఫీట్స్‌ చేయాలంటే కొంచెం కష్టమే. కానీ ఆయన కూడా ప్రొఫిషనల్‌గా ఈ వర్కవుట్స్‌ చేస్తుండడం నాగార్జున ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపుతోంది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగార్జున నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్నారు. 

ALSO READ: శృతి - మైఖేల్‌ లవ్‌ బ్రేకప్‌.!