ENGLISH

షాకింగ్ రోల్ లో నాగ్

24 July 2024-18:01 PM

సీనియర్ హీరోల్లో ఒక్క బాలకృష్ణ తప్ప మిగతా వారు హిట్ కోసం శ్రమిస్తున్నారు. బాలయ్య వరుస హిట్లతో దూసుకుపోతుంటే మిగతావారు రేస్ లో వెనకబడిపోయారు. ఈ ఏడాది ఈ రేస్ లో కొంచెం స్పీడ్ పెంచారు నాగార్జున. సంక్రాంతికి 'నా సామి రంగా' సినిమాతో వచ్చి పాసైపోయారు. నెక్స్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తో కలిసి కుభేర లో నటిస్తున్నారు. ఈ మూవీ దీపావళికి రిలీజ్ కానున్నట్లు సమాచారం. సెప్టెంబరు లో బిగ్ బాస్ సీజన్ 8 మొదలు కానున్న నేపథ్యంలో హోస్ట్ గా బిజీగా మారనున్నారు. నాగ్ మరొక క్రేజీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. 


సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్  కాంబోలో వస్తున్న'కూలీ' లో నాగ్ నటిస్తున్నట్లు తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ విలన్ గా కనిపించనున్నటు సమాచారం. ఈ మధ్యనే 'కూలి' సెట్స్ మీదకు వెళ్ళింది. రజనీకి సమానంగా  ఉండే విలన్  క్యారక్టర్ కావడంతో నాగార్జున కూడా దీనికి ఓకే చెప్పారని, లోకేశ్ నాగ్ ని డిఫరెంట్ గా చూపించబోతున్నారని కోలీవుడ్  మీడియా టాక్. నాగార్జున సాహసం చేస్తున్నారనే చెప్పాలి. మన్మథుడిగా పేరు పొందిన నాగ్ విలన్ గా కనిపించటమంటే ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.  


లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరో క్యారక్టర్ తో పాటు, విలన్ పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. విక్రమ్ సినిమాలో కమల్ తో  పాటు విజయ్ సేతు పతికి కూడా మంచి పేరు వచ్చింది. అలాగే ఈ సినిమాలో లాస్ట్ లో కేవలం కొన్ని నిముషాలు కనిపించిన సూర్య  'రోలెక్స్' పాత్రకు మంచి హైపు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగార్జున విలన్ రోల్ కూడా  మంచి స్కోప్ ఉండి ఉంటుంది అన్న అభిప్రాయం వినిపిస్తోంది.