ENGLISH

చిరుతో అలా... పవన్ తో ఇలా

24 July 2024-17:41 PM

బుల్లితెర యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ, తరవాత సినిమాల్లో కూడా నటిస్తూ  బిజీగా మారింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ ఏం పోస్ట్ చేసినా క్షణాల్లో వైరలైపోతుంది. ఈ మధ్య అనసూయ ఒక రియాలిటీ షోలో జడ్జిగా పాల్గొంటోంది. ఈ షోలో శేఖర్ మాస్టర్ మరొక జడ్జి. శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. యాంకర్ స్థాయి నుంచి జడ్జ్ ప్లేస్ కి చేరుకోవటం నిజంగా గొప్ప విషయమే. ఇదే షోలో అనసూయ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. తాను పవన్ కళ్యాణ్ తో ఒక సాంగ్ చేశానని లీక్ చేసింది. ఆ సాంగ్ ఒక రేంజ్ లో ఉంటుందని, అందరిలో ఉత్సుకత పెంచింది.


ఇదివరకు చిరుతో కలిసి అనసూయ ఒక యాడ్ లో నటించింది. అప్పుడే మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో అనసూయ చిందులు వేస్తే ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టినట్లే. అత్తారింటికి దారేది సినిమాలోనే  పవన్, అనసూయ డాన్స్ చూడాల్సి ఉండగా మిస్ అయ్యింది. కారణం అనసూయ రిజక్ట్ చేసిందని టాక్. ఇప్పుడు మాత్రం పవన్ తో సాంగ్ కి ఓకే చెప్పింది. అనసూయ పవన్ కళ్యాణ్ తో సాంగ్ చేశానని చెప్పింది కానీ అది ఏ సినిమాలో అన్నది రివీల్ చేయకపోవటంతో  ఫాన్స్ నిరుత్సాహం చెందారు.  


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, OG , ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నాడు. అంటే ఈ 3 సినిమాల్లో ఒకదానికి అనసూయ ఐటెం సాంగ్ చేసింది. మాక్సిమం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో అనసూయ స్పెషల్ సాంగ్ చేసి ఉంటుందని ఫాన్స్ అంచనా వేస్తున్నారు. పైగా ఈ పాట షూటింగ్ ఎప్పుడో  అయి ఉండొచ్చని, అనసూయ ఇప్పుడు రివీల్ చేసిందని అంటున్నారు.