ENGLISH

గేమ్ చేంజర్ కి గట్టి పోటీ తప్పదా?

24 July 2024-16:43 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. చాలా రోజులుగా ఈ మూవీపై సరైన అప్డేట్ లేదని మెగా ఫాన్స్ కంగారుపడుతున్నారు. వరసగా హీరోలంతా రావటానికి రెడీ అవుతుంటే చెర్రీ రాక ఎప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ కి రిలీజ్ చేస్తామని దిల్ రాజు ఇటీవల ఓ ఈవెంట్లో ప్రకటించాడు. డిసెంబర్ 20న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అని ఫిలిం నగర్ టాక్.


ఇంత మంచి అప్డేట్ ఇచ్చినా ఫాన్స్ సంతోషంగా లేరు సరి కదా ఆందోళన చెందుతున్నారు. కారణం చెర్రీ వచ్చే టైం సరికాదని. గేమ్ చేంజర్ పై  మొన్నటివరకు పాజిటీవ్ టాక్ ఉన్నా, భారతీయుడు 2 రిజల్ట్ కొంత ఎఫెక్ట్ చూపిస్తుందని, భయపడుతున్నారు. ఇది చాలదన్నట్లు కరెక్టుగా చెర్రీ సినిమా రిలీజ్ టైంలోనే బాలీవుడ్, హాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ కి పోటీగా పుష్ప 2 ఉండొచ్చు అన్న సందేహం ఉంది. బాలీవుడ్ లో, అదే సమయానికి అమీర్ ఖాన్ 'సితారే జమీన్ పర్’ సినిమా రానున్నట్లు  సమాచారం. తారే జమీన్ పర్ సినిమాకి సీక్వెల్ గా సితారే జమీన్ పర్ వస్తోంది. ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. అది కాక వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటిస్తున్న 'బేబీ జాన్' మూవీ కూడా క్రిస్మస్ కి రానున్నట్టు సమాచారం. 


బేబీ జాన్ మూవీ తమిళ సూపర్ హిట్ విజయ్ తేరికి రీమేక్. ఈ మూవీ హిట్ పై మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల మార్కెట్ కి ఓవర్సీస్ కూడా దోహదపడుతున్నాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ కి హాలీవుడ్ లో కూడా చుక్కెదురు కానుంది.    గేమ్ ఛేంజర్ రిలీజ్ టైంకి హాలీవుడ్ లో ది లయన్ కింగ్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ‘ముఫాసా – ది లయన్ కింగ్’ సినిమా విడుదల అవుతోంది. ముఫాసాపై ఇండియాలో మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ విషయంలో కంగారుపడుతున్నారు.