ENGLISH

పేమెంట్ తగ్గించుకున్న ప్రభాస్

23 July 2024-14:59 PM

పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్ సినిమాల్లోనే కాదు బయట కూడా ఉన్నతంగా వ్యవహరిస్తాడు. తన వ్యక్తిత్వంతో యెనలేని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాడు. బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ మార్కెట్ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకొంది. అప్పటినుంచి ఓవర్సీస్ లో సత్తా చాటుతున్నాడు. రీసెంట్ గా వచ్చిన కల్కి మూవీ 1000 కోట్లకి పైగా వసూళ్లు చేసి డార్లింగ్ ని  రారాజు గా నిలబెట్టింది. ఇండియన్ సినిమాలో ప్రభాస్ రేంజ్ పీక్స్ లో ఉంది. ఈ రేంజ్ లో  ఉన్న ప్రభాస్ తో సినిమాలు తీయటానికి దేశవ్యాప్తంగా ఉన్న దర్శకులు ముందుకు వస్తున్నారు. రెమ్యునరేషన్ కూడా ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. 


కానీ బాహుబలి రూటే వేరు. మంచు ఫ్యామిలీ కోసం కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. అదీ ఫ్రీ గా. ఇప్పుడు రాజా సాబ్ మూవీ కోసం తన రెమ్యునరేషన్ భారీగా తగ్గించుకున్నాడని టాక్. కారణం ఒకప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, తన వలన వచ్చిన నష్టాన్ని పూడ్చటానికి అని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ మారుతీ దర్శకత్వం లో రాజా సాబ్ మూవీ  చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. మాములుగా అయితే ప్రభాస్ రెమ్యూనరేషన్ 150 కోట్లు ఉంటుంది. అంటే సినిమాలో సగానికి పైగా బడ్జెట్ ఓన్లీ ప్రభాస్ పేమెంట్ కే సరిపోతుంది. కానీ ప్రభాస్ 85 కోట్లకు ఈ మూవీ చేస్తున్నాడు. 


కారణం ఆదిపురుష్ మూవీ తెలుగు హక్కుల్ని ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మొదట  తీసుకుంది. అప్పటికి అప్పుల్లో ఉన్న యూవీ క్రియేషన్ ఆ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇచ్చింది. ఆ సినిమా  వలన 35 కోట్ల నష్టాన్ని ఎదుర్కొంది పీపుల్స్ మీడియా. అందుకు ప్రతిగా, ప్రభాస్  రాజా సాబ్ కోసం రెమ్యూనరేషన్ తగ్గించుకుని పీపుల్ మీడియాకి భారం తగ్గించారని సమాచారం.