ENGLISH

బొద్దుగుమ్మ నమిత పెళ్ళిపీటలెక్కిన వేళ

24 November 2017-14:13 PM

ముద్దుగుమ్మ నమిత వివాహం తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ రోజు ఉదయం తిరుపతిలోని ఇస్కాన్‌ ఆలయంలో నమిత వివాహం జరిగింది. తమిళ దర్శక, నిర్మాత అయిన వీరేంద్ర చౌదరిని వివాహమాడింది ముద్దుగుమ్మ నమిత. ఈ వివాహానికి రాధికా శరత్‌ కుమార్‌ తదితర పలువురు కోలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యి నమిత - వీరు జంటను ఆశీర్వదించారు. గత రెండేళ్లుగా వీరేంద్ర చౌదరితో ప్రేమలో ఉన్నట్లు గత నెలలో ఓ వీడియో మెసేజ్‌ ద్వారా నమిత చెప్పింది.

ఇటీవల నమితకు సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌తో వివాహం అంటూ పలు రకాల రూమర్స్‌ పుట్టుకొచ్చాయి. అవన్నీ ఒట్టి రూమర్సేనంటూ నమిత కొట్టి పాడేసింది. ఆ తర్వాత నమిత తన ప్రేమ విషయం, తర్వాత పెళ్లి విషయం సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఇదిగో ఈ రోజు అందాల నమిత, వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుని ఒకింటిదయ్యింది. టాలీవుడ్‌లో 'సొంతం' సినిమాతో క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చింది నమిత. తర్వాత శ్రీకాంత్‌, ప్రభుదేవా కాంబినేషన్‌లో 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు', 'ఒక రాజు ఒక రాణి', ప్రబాస్‌తో 'బిల్లా' తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.

'సింహా' సినిమాలో ఐటెం సాంగ్‌లో మెరిసింది. కోలీవుడ్‌లో నమితకు బాగా పాపులారిటీ ఉంది. అయితే దర్శక, నిర్మాతని వివాహమాడిన నమిత, పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తుందా? లేదా అనే విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. పెళ్లి తర్వాత కూడా తెలుగులో సమంత, తమిళంలో జ్యోతిక తదితర నటీమణులు నటనను కొనసాగిస్తున్నారు. అలాగే నమిత కూడా నటిస్తుందో లేదో చూడాలిక.

ALSO READ: Qlik Here Namitha and Veer Wedding Photos