ENGLISH

బిగ్ బాస్ పేరుతో.. జిమ్మిక్‌!!

27 August 2020-17:00 PM

`డార్లింగ్స్ నేను బీబీలో వున్నాను. బీబీలో మ‌న ర‌చ్చ మ‌మూలుగా వుండ‌దు. మీకు మ‌రింత వినోదాన్ని అందించ‌బోతున్నాం. ఇందుకు మీ స‌హ‌కారం కావాలి. అయితే రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు మ‌రో అప్‌డేట్ రెడీగా వుంది. మ‌ళ్లీ ఇక్క‌డే క‌లుద్దాం` అని సోష‌ల్ మీడియాలో.... అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు నందు. బిబి.. అంటే బిగ్ బాస్ ఏమో అని అంతా అనుకున్నారు. బిగ్ బాస్ 4 సీజ‌న్ ఎలాగూ మొద‌ల‌వుతుంది క‌దా, అందులో నందూ కూడా ఉన్నాడేమో అనుకున్నారు. బిగ్ బాస్ లో నందూ క‌నిపించ‌బోతున్నాడ‌న్న విష‌యం టామ్ టామ్ అయిపోయింది. అయితే.. ఇంత‌లో మ‌రో ట్విస్టు ఇచ్చాడు.

 

బిబి అంటే బిగ్ బాస్ కాద‌ని, బొమ్మ బ్లాక్ బస్ట‌ర్ అనే సినిమా అని తేల్చేశాడు. ర‌ష్మీ గౌత‌మ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విజయీభ‌వ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌వీణ్ ప‌గ‌డాల, బోస్ నిడిమోలు, ఆనంద్‌రెడ్డి మ‌డ్డి, మ‌నోహ‌ర్‌రెడ్డి ఈడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ విరాఠ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఆ టైటిల్‌ని... ఇలా వాడుకుని కాస్త వెరైటీగా ప్ర‌చారం చేసుకున్నాడ‌న్న‌మాట‌.

nandu bb

ALSO READ: మూడేళ్లకు త్రిష సినిమాకు విముక్తి.