ENGLISH

ఈ సినిమా ఇక్క‌డా ఫ్లాపే!

18 December 2020-12:10 PM

నానికి వ‌రుస‌గా రెండు ఫ్లాపులొచ్చాయి. `గ్యాంగ్ లీడ‌ర్‌`, `వి` సినిమాలు నాని ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. `గ్యాంగ్ లీడ‌ర్‌` క‌నీసం విమ‌ర్శ‌కుల‌కైనా న‌చ్చింది. `వి` అయితే... అలాంటి ప్ల‌స్ పాయింటూ లేదు. అమేజాన్ లో విడుద‌లైన ఈ సినిమా.. ఎవ్వ‌రికీ మెప్పించ‌లేదు. భారీ రేటు పెట్టి కొనుక్కున్న అమేజాన్‌.. `వి` రిజ‌ల్ట్ తో షాక్ కి గురైంది. ఇప్పుడు ఈ సినిమా బుల్లి తెర‌పైనా వ‌చ్చింది. అస‌లే కొత్త సినిమాలు లేవు. థియేట‌ర్లు తెర‌చినా సంద‌డి లేదు. ఇలాంటి స‌మ‌యంలో.. బుల్లి తెర‌పై నాని సినిమా వ‌స్తే.. రేటింగులు అదిరిపోవాలి.

 

కానీ.. `వి` టీవీల్లోనూ ఫ్లాపే. ఈ సిన‌మాకి కేవ‌లం 6.8 రేటింగ్ మాత్రమే వచ్చింది. నాని గ‌త సినిమాల‌తో పోలిస్తే ఇది చాలా త‌క్కువ‌. గ్యాంగ్ లీడ‌ర్ సైతం... 8.6 రేటింగ్ తెచ్చుకుంది. వి దానికి కూడా చాలా దూరంలో నిల‌బ‌డిపోయింది. నాని ఫ్యామిలీ హీరో. టీవీల్లో నాని పాత సినిమాలు వ‌చ్చినా, రేటింగులు బాగుంటాయి. కానీ... వి విష‌యంలో మాత్రం అలాంటి ఫ‌లితం రాలేదు. ఈ సినిమాని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌న్న‌ది ఆలోచ‌న‌. టీవీ రేటింగులు చూసి, ఆ ఆలోచ‌న ప‌క్క‌న పెడ‌తారేమో..?

ALSO READ: బాల‌య్య దూకుడే దూకుడు