ENGLISH

Dasara: ఒకటే పార్ట్ కానీ.... రెండు సినిమాల కంటే పవర్ఫుల్

28 January 2023-09:35 AM

నాని తొలి పాన్ ఇండియా మూవీ ‘‘దసరా’’ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందనే ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా నాని ట్వీట్‌ చేశాడు. ‘‘ఒకటే పార్ట్ కానీ, రెండు కంటే ఎక్కువ సినిమాల పవర్‌ ఇందులో ఉంటుంది’’ అని ట్వీట్‌ చేశారు. దీంతో రెండు పార్టుల వార్తలకు పుల్ స్టాప్ పడింది.

 

శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడిగా పరిచయం కానున్న ఈ మూవీ మార్చి30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నాని సరసన కీర్తి సురేష్‌ జోడిగా కనిపిస్తుంది. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. నాని ఇప్పటివరకూ చేయని మాస్ పాత్ర ఇందులో చేస్తున్నాడు. ఇప్పటికే బయటికి వచ్చిన ప్రమోషనల్ మెటిరియల్ నాని పాత్రపై ఆసక్తిని పెంచాయి. జనవరి 30న దసరా టీజర్ కూడా వస్తోంది.