ENGLISH

Pathan: ‘పఠాన్‌’ ఆల్ టైం రికార్డ్

27 January 2023-18:00 PM

బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ వసుళ్ళూ రికార్డ్ స్థాయిలో నమోదౌతున్నాయి. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. షారుఖ్‌తోపాటు దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహంల నటన, సల్మాన్ క్యామియో, విజువల్స్‌ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

 

సినిమా మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ కలెక్షన్ లో దూసుకుపోతోంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే అదరగొట్టిన పఠాన్ ఇప్పుడు ఆల్ టైం రికార్డ్ అందుకుంది. రెండు రోజుల్లో 220 కోట్ల రూపాయిల గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు లెక్కకట్టాయి. దీంతో దాదాపు బాలీవుడ్ రికార్డ్ లన్నీ బ్రేక్ అయినట్లే. బాలీవుడ్ సరైన విజయం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. ఇప్పుడు పఠాన్ లెక్కలు చూస్తుంటే.. బాలీవుడ్ కోరుకునే విజయం దక్కిందనే చెప్పాలి.