ENGLISH

నానికి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతున్న 'ఆ' రూమర్లు.!

30 April 2019-12:30 PM

నేచురల్‌ స్టార్‌ నాని - విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకి 'గ్యాంగ్‌లీడర్‌' అని టైటిల్‌ ఫిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టైటిల్‌ని మెగా హీరోలు మాత్రమే వినియోగించుకోవాలంటూ మొన్నా మధ్య రచ్చ మొదలైన సంగతి తెలిసిందే. ఈ రచ్చపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది లేదు కానీ, సినిమా కథ విషయంలో ఇప్పుడు మరో రగడ మొదలైంది. మహేష్‌ చేయాల్సిన సినిమా కథ 'గ్యాంగ్‌లీడర్‌' అనీ, మహేష్‌కి కథ నచ్చకపోవడంతో అది నాని చేతికి వెళ్లిందనీ అంటున్నారు. 

 

అయితే నాని మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకెళ్లిపోతున్నాడు. కథ విషయంలో విక్రమ్‌ కుమార్‌ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇక నాని విషయమంటారా.? 'జెర్సీ' సక్సెస్‌ నానిలో మళ్లీ కాన్ఫిడెన్స్‌ డెవలప్‌ చేసింది. కథ విషయానికి వస్తే, కథలోని వేరియేషన్స్‌ నాటి క్లాసికల్‌ మూవీ 'జానకి రాముడు' కథని తలపించేలా ఉండబోతోందట. అంటే మూడు జన్మల నేపథ్యంలో సాగే కథ అనీ తెలుస్తోంది. ఏది ఏమైనా నానికి 'గ్యాంగ్‌లీడర్‌' వివాదం ఫ్రీ పబ్లిసిటీ తెస్తున్నట్లే కనిపిస్తోంది. 

 

ప్రస్తుతం ఈ సినిమా సైలెంట్‌గా షూటింగ్‌ జరుపుకుంటూ పోతోంది. ఓ పక్క 'గ్యాంగ్‌లీడర్‌'లో నటిస్తూనే, మరోవైపు తాజాగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణతో నాని 'వి' సినిమా లేటెస్ట్‌గా పట్టాలెక్కించేశాడు. ఇదిలా ఉంటే, తన సొంత బ్యానర్‌లో నిర్మాతగా ఓ సినిమాకి కూడా నాని ప్లాన్‌ చేస్తున్నాడట. సో ఏది ఏమైనా ఈ పరిస్థితుల్లో నాని దూకుడుకి బ్రేకులు పడే అవకాశమే లేదనిపిస్తోంది

ALSO READ: అక్కినేని బుల్లోడు ఈ సారి సిక్స్‌ ప్యాక్‌ పక్కా.!