ENGLISH

బాలయ్య ఫస్ట్ హంట్.. ఫ్యాన్స్ కి పూనకాలే

09 June 2022-16:25 PM

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఓ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌న రూపుదిద్దుకుటుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి ఫస్ట్ హంట్ పేరుతో టీజర్ బయటికి వచ్చింది. ఫుల్ యాక్షన్ తో పాటు బాలయ్య అభిమానులకు పూనకలు తెప్పెంచే డైలాగులు ఈ టీజర్ లో వున్నాయి. 

 

మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ నా జీవో గాడ్స్ ఆర్డర్.. 

 

భయం నా బయోడేటా లోనే లేదురా బోసడికే.. 

నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకి కూడా తెలీదు నా కోడకల్లార్రా .. 

ఇదీ డైలాగుల వరుస. 'బోసడికే' అనే మాట చుట్టూ ఆ మద్య చాలా వివాదం నడిచింది. ఇప్పుడు అదే డైలాగ్ బాలయ్య వినిపించారు. టీజర్ మాత్రం పవర్ ప్యాక్డ్ గా వుంది. ఒకరోజు ముందే బాలయ్య అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ దొరికేసింది.

 

ALSO READ: ట్రైలర్ : 'గాడ్సే' పొలిటికల్ వార్