ENGLISH

ఐ డోంట్ కేర్ అంటున్న బాల‌య్య‌

09 June 2022-18:29 PM

నంద‌మూరి బాల‌కృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. ఎఫ్ 3 త‌ర‌వాత‌... అనిల్ రావిపూడి చేయ‌బోయే సినిమా ఇదే. ఇప్ప‌టికే స్క్రిప్టు పూర్త‌య్యింది. దానికి కొన్ని మెరుగులు దిద్దుతున్నాడు రావిపూడి. సెప్టెంబ‌రులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రానికి `బ్రో.. ఐ డోన్ట్ కేర్‌` అనే పేరు ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ సినిమాలో బాల‌య్య క్యారెక్ట‌రైజేష‌న్ కి త‌గిన టైటిల్ ఇద‌ని, అందుకే ఈ టైటిల్ ని రిజిస్ట‌ర్ చేసి పెట్టుకున్న‌ట్టు టాక్‌. తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. బాలయ్య కూతురిగా శ్రీ‌లీల ఫిక్స‌య్యింది. బాల‌య్య స‌ర‌స‌న క‌థానాయిక‌గా ప్రియ‌మ‌ణిని ఎంచుకొన్న‌ట్టు టాక్ న‌డుస్తోంది.

 

మ‌రోవైపు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాల‌య్య‌. ఈ సినిమాకి సంబంధించిన‌టైటిల్ ఇంత వ‌ర‌కూ ప్ర‌క‌టించ‌లేదు. `రెడ్డిగారు` లేదంటే `అన్న‌గారు` అనే టైటిల్స్ లోఒక‌టి ఫిక్స‌య్యే అవ‌కాశం ఉంద‌ట‌. ఈ సాయింత్రం టీజ‌ర్ వ‌స్తోంది. ఆ టీజ‌ర్‌లోనే టైటిల్ ఏంట‌న్న‌ది చెప్పేస్తారు. మ‌రి ఆ టీజ‌ర్ ఎలా ఉంటుందో, ఆ టైటిల్ ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని గంట‌లు ఆగాల్సిందే.

ALSO READ: బాలయ్య ఫస్ట్ హంట్.. ఫ్యాన్స్ కి పూనకాలే