ENGLISH

'చిరుత' పాప గ్లామర్‌ సెల్ఫీ చూస్తారా?

12 April 2018-10:40 AM

'చిరుత' సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన భామ గుర్తుంది కదా నేహాశర్మ. ఆ పాపకి తెలుగులో సినిమాలు చేయాలని ఉందట. అందుకోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నానంటోంది. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ డెబ్యూ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలకే టాలీవుడ్‌ నుండి మాయమైపోయింది. అందం, అభినయం, డాన్సింగ్‌ పర్‌ఫామెన్స్‌ అన్నీ ఉన్నా అమ్మడికి అదృష్టం కలిసి రావడం లేదు. బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా అంతంత మాత్రంగానే ఈ ముద్దుగుమ్మకి అవకాశాలు వచ్చాయి. దాంతో ఇప్పుడు మళ్లీ తెలుగు తెరపై గంపెడు ఆశతో ఇదిగో సోషల్‌ మీడియాలో హాట్‌ ప్రదర్శన చేస్తూ 'నేనున్నాను.. ఒక్కసారి ఇటు వైపు ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకోండి' అంటోంది. హీరోయిన్‌గా కాకపోయినా, ఐటెం గాళ్‌గానైనా ఓకే అంటోందట ఈ ముద్దుగుమ్మ. అమ్మడి గోడు విని ఎవరో ఒకరు, ఏదో ఒక అవకాశం ఇస్తే బావుంటుంది పాపం పాపకి.

ALSO READ: Qlik Here For The Gallery Of Neha Sharma