ENGLISH

రాహుల్ కి నాకు మధ్య ఏమి లేదు: నిధి అగర్వాల్

31 May 2018-18:42 PM

క్రికెటర్లకి-హీరోయిన్లకి మధ్య ప్రేమాయణం అనేది ఇప్పటి విషయం కాదు దాదాపు 5 దాశాబ్దాల క్రితం షర్మిలా టాగూర్-టైగర్ పటౌడి ల వివాహం నుండే ఈ ట్రెండ్  మొదలైంది అని చెప్పొచ్చు. 

ఇక తాజాగా భారత క్రికెట్ జట్టు ఆటగాడు అయిన రాహుల్ ముంబైలోని ఒక రెస్టారెంట్ లో నటి నిధి అగర్వాల్ తో కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరిరువురు రెస్టారెంట్ నుండి బయటకి వస్తున్న ఫోటోలు అంతర్జాలంలో హల్చల్ చేస్తున్నాయి.

ఈ ఫోటోల పైన హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందిస్తూ- తమకి చాలా కాలం క్రితం నుండే పరిచయం ఉందని ఇంతకముందు కూడా తాము చాలాసార్లు కలుసుకున్నాం అని చెబుతూ- తామేమి డేటింగ్ లో లేము అని స్పష్టం చేసింది.

రాహుల్ ఈ విషయమై ఇంకా ఎటువంటి వివరణ ఇవ్వలేదు.

 

ALSO READ: అన్నపూర్ణ స్టూడియోస్ లో వ్యక్తి అనుమానాస్పద మృతి