ENGLISH

నిధికి సక్సెస్‌ నిధి దొరికేనా.!

13 December 2018-12:19 PM

బాలీవుడ్‌లో 'మున్నా మైఖేల్‌' సినిమాతో తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. తొలి సినిమాతోనే అక్కడ సూపర్‌ సక్సెస్‌ అందుకుంది. క్యూట్‌ అండ్‌ హాటెస్ట్‌ హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసింది. ఇక తెలుగులోనూ తన అందాల్ని పరిచయం చేయలనే నేపథ్యంలో అక్కినేని బుల్లోడు నాగచైతన్యతో 'సవ్యసాచి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన రిజల్ట్‌ అందించలేదు ఈ భామకి. యాక్టింగ్‌ టాలెంట్‌, డాన్సుల్లో జబర్దస్త్‌ టాలెంట్‌ ఉన్నా, హిట్‌ దక్కకపోవడంతో అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు.

ఇకపోతే ఇప్పుడు మళ్లీ అక్కినేని హీరోతోనే రీ లాంచ్‌ అవుతోంది నిధి అగర్వాల్‌. అదే 'మిస్టర్‌ మజ్ను'. స్టైల్‌, గ్లామర్‌ అన్నీ సమపాళ్లలో ఉన్న నిధి అగర్వాల్‌కి అదృష్ట నిధి కలిసొస్తే తప్ప సక్సెస్‌ తలుపు తట్టే అవకాశం లేదు. అసలే ఫెయిల్యూర్స్‌లో ఉన్నాడు అఖిల్‌. లాంఛింగ్‌ మూవీ, రీ లాంఛింగ్‌ మూవీ అంటూ రెండు సినిమాలతోనూ నిరాశపరిచాడు. ఇక ముచ్చటగా మూడో సినిమాగా ఈ మిస్టర్‌ మజ్నుతో వస్తున్నాడు. జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'తొలిప్రేమ' సినిమాతో వరుణ్‌తేజ్‌కి సూపర్‌ డూపర్‌ హిట్‌ ఇచ్చిన వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. నిధి అగర్వాల్‌ తరపు నుండైనా అఖిల్‌కి అదృష్టం కలిసి రావాలి. ఇక నిధి విషయానికి వస్తే, అమ్మడి టాలెంట్‌కి టైం కలిసొస్తే స్టార్‌ హీరోయిన్‌ అవ్వదగ్గ అన్ని లక్షణాలూ ఉన్నాయి. అయితే అక్కినేని వారసులు ఎంతవరకూ నిధిని ఆదుకోగలరు. సక్సెస్‌ ఉంటే తప్ప ఆఫర్‌ మాటే లేదీ రోజుల్లో. నిధి పరిస్థితి ఏంటో చూడాలి మరి.

ALSO READ: గ్లామ్‌షాట్‌: ఆహా! సుందరీ ఏమి నీ సౌందర్యమూ.!