ENGLISH

నిహారిక పెళ్లి... అప్ డేట్ ఇదే!

06 November 2020-15:30 PM

నాగ‌బాబు కూతురు నిహారిక పెళ్లి చైత‌న్య‌తో నిశ్చ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌రులో పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని నాగ‌బాబు ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించాడు. అయితే... తేది స్ప‌ష్టంగా చెప్ప‌లేదు. ఇప్పుడు వివాహ ముహూర్తం, వేదిక రెండూ ఖ‌రార‌య్యాయి.

 

నిహారిక‌ పెళ్లి డిసెంబ‌రు 9, రాత్రి 7 గంట‌ల‌కు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ రిసార్ట్ లో జ‌ర‌గ‌బోతోంది. ఇది డెస్టినేష‌న్ వెడ్డింగ్‌. ఇరు కుటుంబాల నుంచి కేవ‌లం 100మంది అతిథులు మాత్ర‌మే హాజ‌ర‌వుతారు. పెళ్ల‌య్యాక హైద‌రాబాద్‌లో రిసెప్ష‌న్ ఏర్పాటు చేస్తారు. రిసెప్ష‌న్ లో సైతం త‌క్కువ మంది అతిథులే పాల్గొంటార‌ని తెలుస్తోంది. ఈ రిసెప్ష‌న్‌... కేవ‌లం టాలీవుడ్ లోని సెల‌బ్రెటీల కోస‌మేన‌ట‌.

ALSO READ: బిగ్‌బాస్‌ ‘ఎమోషనల్‌’ కట్టుకథలు!