ENGLISH

పవన్‌ హీరోయిన్‌ అలా అనేసిందేంటీ?

03 September 2020-14:21 PM

పవన్‌ కళ్యాణ్‌ సరసన ‘కొమరం పులి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నికీషా పటేల్‌ గుర్తుందా.? గత ఏడాది పవన్‌ కళ్యాణ్‌కి సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిందిగానీ, ఈ క్రమంలో ఆమె ‘హ్యాష్‌ట్యాగ్‌’ని తప్పుగా వేయడంతో కొందరు పవన్‌ అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. దాంతో ఆమె కొంత అసహనానికి గురయ్యింది. ఈ ఏడాది కూడా పవన్‌ కళ్యాణ్‌కి బర్త్‌ డే విషెస్‌ చెప్పింది. ఈసారి సరిగ్గానే హ్యాష్‌ ట్యాగ్స్‌ వినియోగించింది.

 

అయితే, ‘నేను మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను.. కానీ, మీ నుంచి నాకు ఎలాంటి విషెస్‌ తిరిగి రావడంలేదు. అయినా, మీకు నేను పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే వుంటాను..’ అని పేర్కొంది. బహుశా ఆమె మొర విన్నారో ఏమోగానీ, పవన్‌ కళ్యాణ్‌.. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన నికీషా పటేల్‌కి ‘థ్యాంక్స్‌’ చెబుతూ రిప్లయ్‌ ఇచ్చారు. నికీషా పటేల్‌ తెలుగులో ‘కొమరం పులి’ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఓం’ తదితర సినిమాల్లో నటించిందిగానీ, హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సరైన గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.

 

కన్నడ, తమిళ సినిమాలు కొన్ని చేస్తోందిప్పుడు. ఇవి కాక కొన్ని ఇంగ్లీషు వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తోంది.. అవి విదేశాల్లో నిర్మితమైనవి కావడం గమనార్హం. తెలుగులో నికీషా పటేల్‌ ‘గుంటూరు టాకీస్‌ 2’ అనే సినిమా చేయాల్సి వున్నా, ఆ సినిమా ఏమయ్యిందో ఎవరికీ తెలియడంలేదు.

ALSO READ: Nikesha Patel Hot Photoshoot